సహజంగా హిందీలో ఎక్కువగా కనిపించే కామెడీ ఫ్రాంచైజీని తెలుగులో ‘ఎఫ్ 3’తో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు అనీల్ రావిపూడి. మూడేళ్ళ క్రితం సంక్రాంతికి విడుదలై బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘ఎఫ్ 2’ కి ఫ్రాంచైజీ రాసుకొని ‘F3’ రెడీ చేసుకున్నాడు అనిల్. సేమ్ కాస్టింగ్ తో కొందరిని యాడ్ చేసుకొని సినిమా చేశాడు. దర్శకుడు అనిల్ మీద ఉన్న కాన్ఫిడెంట్ తో దిల్ రాజు కూడా ఈ సినిమాకు సంబంధించి మొత్తం భాద్యతను దర్శకుడి మీదే పెట్టేశాడు.
‘ఎఫ్ 2’ లో భార్యల వలన భర్తలకు వచ్చే ఫ్రస్ట్రేషన్ చూపించి ఆడియన్స్ కి ఫన్ అందించాడు అనిల్. దర్శకుడిగా హిలేరియస్ ఎంటర్టైనర్ డెలివరీ చేసి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. దాంతో వెంటనే మహేష్ బాబు సినిమా చాన్స్ అందుకొని స్టార్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ బాలయ్యతో సినిమా చేయబోతున్నాడు. బాలయ్య కూడా తన అప్ కమింగ్ డైరెక్టర్ సక్సెస్ కోసం టెన్షన్ పడుతున్నాడు. ఈ సక్సెస్ అనిల్ కి చాలా ఇంపార్టెంట్. ‘ఎఫ్ 2’ తో ఆ రేంజ్ సక్సెస్ అందుకున్న అనిల్ ఇప్పుడు ‘ఎఫ్ 3’ తో ఆ మేజిక్ రిపీట్ చేస్తాడా ? లేదా ? అనే సందేహంతో ఇటు ఇండస్ట్రీ అటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
నిజానికి అనిల్ రావిపూడి సినిమాల్లో పెద్ద కథ ఏమి ఉండదు. చిన్న లైన్ తీసుకొని దాని చుట్టూ ఆకట్టుకునే స్క్రీన్ ప్లే , తన స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్ మెంట్ క్రియేట్ చేసి హిట్లు కొడుతున్నాడు. ఇప్పటి వరకూ అనిల్ రావిపూడి ఆరు సినిమాలు డైరెక్ట్ చేశాడు. అందులో అన్ని హిట్లే. ఫ్రాంచైజీ ప్రెజర్ తో పాటు ఫ్లాప్ లేని డైరెక్టర్ అనే బిరుదు కూడా అనిల్ ని ఇప్పుడు భయపెట్టే అంశాలే. ఏదేమైనా అనిల్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. ‘ఎఫ్ 3’ ట్రైలర్ కూడా హిట్టయింది. మొదటి రోజు మార్నింగ్ షోకి ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా ఈ ఫన్ ఫ్రాంచైజీ చూసేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కట్టడం ఖాయం. మరి అనిల్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ సాధిస్తాడో చూడాలి.
This post was last modified on May 25, 2022 11:30 am
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…
రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…