బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ చనిపోయి పది రోజులు అయిపోయింది. అతడిది ఆత్మహత్య అనే అందరూ మొదట్నుంచి భావిస్తున్నారు. ప్రాథమికంగా పోలీసులు చెప్పింది కూడా ఇదే. ఐతే కొన్ని రోజుల తర్వాత మీడియాలో సుశాంత్ మరణానికి సంబంధించి రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. సోషల్ మీడియాలో అయితే సుశాంత్ మరణం మీద ఎన్నో సందేహాలతో విశ్లేషణలు కనిపించాయి. అతడిది ఆత్మహత్య కాదని.. ప్రి ప్లాన్డ్ మర్డర్ అని.. చనిపోవడానికి కొన్ని గంటల ముందు కూడా సుశాంత్ హుషారుగా ఉన్నాడని, బయటికి కూడా వెళ్లొచ్చాడని.. మృతదేహాన్ని చూస్తే ఆత్మహత్య చేసుకున్నట్లుగా లేదని.. అనేక అనుమానాలున్నాయని.. ఇలా ఎన్నో సందేహాలు వినిపించాయి. ఐతే సుశాంత్ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వైద్యులు మాత్రం ఈ ప్రచారాలన్నింటినీ కొట్టిపారేశారు. సుశాంత్‌ది ఆత్మహత్య అని నిర్ధారించారు.
సుశాంత్‌ది హై ప్రొఫైల్ కేసు కావడంతో ఏకంగా ఐదుగురు వైద్యులు అతడి మృత దేహానికి పోస్టు మార్టం నిర్వహించారు. ఆ ఐదుగురూ కలిసి అతడిది ఆత్మహత్యే అని నిర్ధరిస్తూ పోస్టుమార్టం తుది నివేదిక మీద సంతకాలు కూడా చేశారు. సుశాంత్ మృతికి సంబంధించి అనుమానాస్పద రీతిలో ఏం జరగలేదని, అతని శరీరంపై ఎలాంటి గాయాలు లేవని తుది నివేదికలో వెల్లడైంది. ఉరి వేసుకోవడం వల్ల ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై సుశాంత్ మరణించాడని.. ఊపిరాడకపోవడమే మృతికి కారణమని ఇందులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. సుశాంత్ మృతి కేసులో ఫోరెన్సెక్ ప్రక్రియను వేగవంతం చేయాలని బాంద్రా పోలీసులు డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్‌కు లేఖ రాశారు. ఈ కేసులో పోలీసులు 23 మంది స్టేట్‌మెంట్స్‌ను రికార్డ్ చేశారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న బిల్డింగ్ సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు ఇప్పటికే పరిశీలించారు. సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో అతను పెంచుకుంటున్న పెంపుడు కుక్క మరో గదిలో ఉందని.. అది ప్రస్తుతం బతికే ఉందని పోలీసులు స్పష్టం చేశారు.
This post was last modified on June 24, 2020 10:01 pm
ఏమాత్రం కనికరం లేకుండా భారత హిందువుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ హస్తం ఉన్నట్లు బహిర్గతమైన విషయం తెలిసిందే.…
మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మక పెట్టుబడుల వేటలో కీలకమైన రెన్యూ ఎనర్జీ ఒకటి. 2014-17 మధ్య కాలంలో కియా కార్ల…
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, ఫైర్‌బ్రాండ్.. కొడాలి నానికి రాజకీయంగా గుడివాడ నియోజకవర్గంలో గట్టి పట్టుంది. ఆయన వరుస విజయాలు…
పంజాబ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ పూర్ణం కుమార్ షా బుధవారం స్వదేశానికి సురక్షితంగా…
మే 30 విడుదల కావాల్సిన కింగ్ డమ్ విడుదల అధికారికంగా వాయిదా పడింది. పోస్ట్ పోన్ వార్త పాతదే అయినా…
ఏపీలో విపక్ష పార్టీ వైసీపీకి మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఓ భారీ ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ అదినేత,…