ఒకే టైటిల్ కోసం రెండు సినిమాలు పోటీ పడటం కొత్తేమి కాదు. గతంలో ఈ విషయంగానే వివాదాలు జరిగాయి. మహేష్ అంతటి సూపర్ స్టార్ కే ఖలేజా విషయంలో ఇబ్బందులు ఎదురైతే హీరో పేరు తగిలించి మేనేజ్ చేయాల్సి వచ్చింది. కళ్యాణ్ రామ్ కత్తి కూడా ఇలాంటి చిక్కే ఎదురయ్యింది. నాని గ్యాంగ్ లీడర్ సైతం ఇదే బాపతే. కొన్ని సామరస్యంగా పరిష్కారమైతే కొన్ని కోర్టు మెట్ల దాకా ఎక్కినవి ఉన్నాయి.ఈ తలనెప్పి ఎందుకని మార్చుకున్నవీ ఉన్నాయి. ఇప్పుడు మంచు విష్ణు చైతు మధ్య ఇలాంటి చిక్కుముడి వచ్చేలా ఉంది.
విష్ణు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.దీనికి ముందు నుంచి గాలి నాగేశ్వరరావు టైటిల్ ప్రచారంలో ఉంది. తన సోషల్ మీడియా అకౌంట్స్ లో మంచు విష్ణు దీన్నే పేర్కొంటూ వచ్చారు. అయితే రిజిస్టర్ చేశారా లేదానేది మాత్రం తెలియలేదు. నాగచైతన్య పరశురామ్ కాంబోలో రూపొందబోయే చిత్రానికి నాగేశ్వరరావు పేరునే అనుకుంటున్నారట. కాకపోతే ముందు వెనుక ఎలాంటి తోకలు ఉండవు.
మంచు విష్ణు టైటిల్ లో ముందు గాలి ఉంది కానీ రెండు ఒకే సౌండ్ లా అనిపిస్తాయి. కాబట్టి ఒకరు మార్చుకోడం బెటర్. చైతు కోసం ఆల్రెడీ నాగేశ్వరావు రిజిస్టర్ అయ్యిందట. అయితే విష్ణు మూవీకి జిన్నా అనే మరో పేరు కూడా పరిశీలనలో ఉంది. ఒకవేళ వీళ్ళు దీనికి లాక్ అయితే తాతయ్య పేరుతో చైతు సినిమా వచ్చేయొచ్చు. సర్కారు వారి పాట ఫలితంతో సంతృప్తిగా ఉన్న పరశురామ్ ఈసారి మాస్ అంశాలున్నకమర్షియల్ సబ్జెక్టు జోలికి వెళ్లకుండా గీత గోవిందం స్టైల్ లో మంచి ఎంటర్ టైనర్ ప్లాన్ చేసుకున్నారట. మంచిదే.
This post was last modified on May 24, 2022 2:57 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…