కరోనా వల్ల లెక్కలన్నీ తారుమారు అయిపోయాయి. లాక్ డౌన్ కి ముందున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. థియేటర్లు తెరవడం లేదు. తెరచినా సినిమా విడుదల చేయడానికి ఏ నిర్మాతా రెడీగా లేడు. ఉన్నా.. సినిమా కొనే బయ్యరే లేడు. ఇది వరకు కొన్న సినిమాల్ని కూడా మాకొద్దు… అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేయండి అంటూ తిరిగి లాగేసుకుంటున్నారు. రెడ్, క్రాక్, సోలో బ్రతుకే సో బెటరు చిత్రాలు ఇదే సమస్యని ఎదుర్కొంటున్నాయి.
ఈ మూడు సినిమాలకు సంబంధించిన థియేటరికల్ రైట్స్ ముందే సేల్ అయిపోయాయి. బయ్యర్లు అడ్వాన్సులు ఇచ్చేశారు. క్రాక్ సినిమాని అన్ని ఏరియాల్లో కలిపి 20 కోట్లకు కొనేశారు. అందుకు సంబంధించిన అడ్వాన్సులూ ఇచ్చేశారు. 16 కోట్లకు సోలో బ్రతుకే సో బెటరు అమ్ముడైంది. రెడ్ కీ మంచి రేటు దక్కింది. అయితే ఇప్పుడు బయ్యర్లు ఈ సినిమాల్ని వదులుకోవడానికి రెడీ అయ్యారు. మాకు ఈ సినిమాలొద్దు అని నిర్మాతలకు తెగేసి చెప్పేశార్ట. కావాలంటే కమీషన్ పద్ధతిన మీ సినిమాల్ని విడుదల చేస్తాం కానీ, కొనలేం – అంటున్నార్ట.
కరోనా రోజు రోజుకీ విస్తరిస్తున్న నేపథ్యంలో థియేటర్లు తెరచుకోవడానికి అనుమతులు రావడం కష్టంగా మారింది. ఒకవేళ థియేటర్లు తెరచుకున్నా, జనం వస్తారో, రారో అనే భయాలు ఎలాగూ ఉన్నాయి. సీట్ల సంఖ్య కుదిస్తే – థియేటర్ల రాబడి పూర్తిగా తగ్గిపోతుంది. అందుకే బయ్యర్లు ఏమాత్రం రిస్క్ తీసుకోవడానికి ఇష్ట పడడం లేదని తేలిపోయింది. ఈ మూడు సినిమాలే కాదు. ఇది వరకే బిజినెస్ పూర్తయిన మరిన్ని సినిమాలకూ ఇదే సమస్య ఎదురయ్యే అవకాశాలు పుష్కలం. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలు విడుదల చేయాలంటే ఆ రిస్కు నిర్మాతే భరించాలేమో.
This post was last modified on June 24, 2020 8:25 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…