దిల్ రాజు.. టాలీవుడ్లో కొమ్ములు తిరిగిన నిర్మాత, డిస్ట్రిబ్యూటర్. అంత పెద్ద నిర్మాత ఇటీవల ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. గత ఆరు నెలల నుంచి సినిమాల పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నానని.. ఒక వర్గం ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారని ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయంలో విశ్లేషకులు, మీడియా వాళ్లు ముందు నుంచే హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా టాలీవుడ్ మేల్కోలేదు.
అసలే కొవిడ్ ప్రభావంతో థియేటర్లకు వచ్చే అలవాటు తప్పి, ఓటీటీలకు అలవాటు పడి కొంత శాతం థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులు తగ్గిపోగా.. టికెట్ల ధరల ప్రభావం కూడా పడి ఆ శాతం ఇంకా పెరిగిపోయింది. ఈ విషయాన్ని దిల్ రాజు త్వరగానే గుర్తించి.. ఈ ప్రకటన చేసినట్లున్నారు. ఐతే ఇలా థియేటర్లకు రావడం మానేసిన, తగ్గించిన ప్రేక్షకులను మళ్లీ ఇటు వైపు రప్పించేవి ఏవన్నదే ఇప్పుడు చర్చ. ముందుగా కనిపిస్తున్న సమాధానం.. ఎఫ్-3.
థియేటర్లకు రావడం తగ్గించేసిన ప్రేక్షకుల్లో ఎక్కువ శాతం ఫ్యామిలీ ఆడియన్సే. ఓటీటీల్లో చౌకగా వినోదం వస్తుండటం, చూడ్డానికి బోలెడంత కంటెంట్ అందుబాటులో ఉండటం, అదే సమయంలో సినీ వినోదం ఖరీదైపోవడం, తమ అభిరుచికి తగ్గ సినిమాలు రాకపోవడం.. ఇవీ ఆ వర్గం ప్రేక్షకులు థియేటర్లకు దూరం కావడానికి ప్రధాన కారణాలు. ఐతే అసలే రేట్లు పెరిగిపోగా.. పెద్ద సినిమాలకు తొలి వారం, పది రోజులు అదనంగా వడ్డిస్తుండటం ప్రేక్షకుల ఆగ్రహానికి కారణమైంది. ఐతే ఎఫ్-3 సినిమాకు అదనపు రేట్లు లేవు. సాధారణ స్థాయిలో కొంచెం ఎక్కువ స్థాయిలోనే రేట్లు ఉన్నప్పటికీ.. అందుకు సరిపడా వినోదం అందిస్తే ప్రేక్షకులు చూస్తారు.
ఇక గత రెండేళ్లలో ఫ్యామిలీ ఆడియన్స్‌ను పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేసే సినిమాలు రాలేదనే చెప్పాలి. చివరగా అలా అన్ని రకాలుగా వారిని అలరించిన సినిమా అల వైకుంఠపురములో అనే చెప్పాలి. ఎఫ్-3 పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం, దీనికి ప్రమోషన్లు గట్టిగా చేసి అంచనాలు పెంచడం, ట్రైలర్ కూడా ఆకర్షణీయంగా ఉండడంతో కుటుంబ ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు నడిచే అవకాశాలున్నాయి. రేట్లు ఇంకొంచెం రీజనబుల్‌గా ఉంటే బాగుండేదన్న అభిప్రాయం ఉంది కానీ.. సినిమాకు మంచి టాక్ వస్తే థియేటర్లకు ఫ్యామిలీ ఆడియన్స్‌తో కళకళలాడే అవకాశాలున్నాయి.
This post was last modified on May 24, 2022 7:15 am
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…