అదేంటో బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. చిరంజీవి సినిమా బెనిఫిట్ షోకి హౌస్ ఫుల్స్ పడలేదు. మహేష్ బాబు మూవీ రెండో వారంలో స్ట్రగుల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ రీమేక్ అతికష్టం మీద బ్రేక్ ఈవెన్ చేరుకుంది. ఒక కన్నడ డబ్బింగ్ చిత్రం మన ప్యాన్ ఇండియా మల్టీ స్టారర్ ని దాటేసింది. ఇవేవీ ఊహించినవి కాదు. అనుకున్నది ఒకటి అయినది ఒకటి తరహాలో ఎదురైన పోకడలు. కొన్ని మరీ విచిత్రంగా ఇమేజ్ ఉన్న హీరో నటించి ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉన్నా విడుదల కాని అయోమయంలో పడ్డాయి.
అందులో శర్వానంద్ ఒకే ఒక జీవితం ఉంది. ఎప్పుడో అయిదు నెలల క్రితం టీజర్ వచ్చింది. నాలుగున్నర మిలియన్స్ వ్యూస్ ని బట్టి దీని మీద ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారని అర్థమయ్యింది. కానీ ట్రైలర్ ఊసు లేదు. ఆ మధ్య మదర్ సెంటిమెంట్ సాంగ్ ఒకటి వదిలారు. తర్వాత మళ్ళీ గప్ చుప్. శ్రీకార్తీక్ దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ కం టైం ట్రావెల్ ఎంటర్ టైనర్ లో రీతూ వర్మ హీరోయిన్. కొంచెం గ్యాప్ తర్వాత అక్కినేని అమల ఇందులో ఓ కీలక పాత్ర పోషించారు. తమిళంలోనూ ఒకేసారి రిలీజ్ కు ప్లాన్ చేశారు
ఇదంతా బాగానే ఉంది కానీ ఒకే ఒక జీవితం ఎప్పుడు వస్తుందో అంతు చిక్కడం లేదు. శర్వానంద్ మార్కెట్ గత కొన్నేళ్లుగా డౌన్ లో ఉంది. వరస డిజాస్టర్లు తన థియేట్రికల్ బిజినెస్ మీద తీవ్ర ప్రభావం చూపించాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న శ్రీకారం, ఆడవాళ్ళు మీకు జోహార్లు లాంటి మంచి సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. కోలీవుడ్ లో సంచలనం సృష్టించిన 96 ఇక్కడ జానుగా దెబ్బతింది. డ్రీం వారియర్ లాంటి పెద్ద బ్యానర్ ఉన్నా ఒకే ఒక జీవితానికి మోక్షం ఎప్పుడో కాలమే సమాధానం చెప్పాలి. అసలే ఆగస్ట్ దాకా ప్రతి శుక్రవారం కొత్త సినిమాల రిలీజులతో కిక్కిరిసిపోతోంది. మరి శర్వాకు స్పేస్ దొరికేదెప్పుడో.
This post was last modified on May 23, 2022 9:03 pm
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…