పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ లైనప్ లో ఫ్యాన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తున్న సినిమా ‘భవదీయుడు భగత్ సింగ్’ . పదేళ్ళ క్రితం వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ -హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. దీనికి తోడు టైటిల్ పోస్టర్ , పవన్ లుక్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా ? అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి తాజాగా ఓ ఇంటర్వ్యూ ద్వారా అప్ డేట్స్ ఇచ్చాడు హరీష్.
తమ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా ఆగస్ట్ నుండి షూటింగ్ జరుపుకోనుందని, 80 పర్సెంట్ షూట్ హైదరాబాద్ లోనే ఉంటుందని తెలిపాడు హరీష్. అలాగే ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా మూవీ కాదని, పక్కా కమర్షియల్ తెలుగు సినిమాగా రానుందని క్లారిటీ ఇచ్చాడు. పవన్ నుండి పాన్ ఇండియా అంటే ‘హరి హర వీరమల్లు’ మాత్రమే అని హరీష్ ఈ సందర్భంగా చెప్పాడు. ఇక సినిమాలో పవన్ రోల్ గురించి కూడా క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు. సినిమాలో పవర్ స్టార్ లెక్చరర్ కేరెక్టర్ లో కనిపిస్తాడని ఈ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలిపాడు.
మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ యర్నేని , రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలు పెట్టారు. పూజ హెగ్డే ని హీరోయిన్ గా లాక్ చేసుకున్నారు. త్వరలోనే మిగతా డీటెయిల్స్ బయటికి రానున్నాయి.
This post was last modified on May 23, 2022 12:25 pm
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…