‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ లాంటి హిట్ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ పిర్జాదా. ఆమెకు ఉన్నంతలో మంచి అవకాశాలే వచ్చాయి కానీ.. నిలకడగా విజయాలు సాధించలేకపోవడం వల్ల ఒక స్థాయికి మించి ఎదగలేకపోయింది. తొలి సినిమా తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్ కూడా హిట్టవడంతో మెహ్రీన్ పెద్ద రేంజికి వెళ్లేలా కనిపించింది. కానీ తర్వాత వరుసగా పరాజయాలు పలకరించాయి. ఎఫ్-2 మినహాయిస్తే గత నాలుగైదేళ్లలో ఆమెకు హిట్టే లేదు.
ఇప్పుడు ‘ఎఫ్-2’కు కొనసాగింపుగా వస్తున్న ‘ఎఫ్-3’ మీదే ఆమె ఆశలన్నీ నిలిచాయి. కానీ ఇందులో తమన్నా, సోనాల్ చౌహాన్, పూజా హెగ్డేలు కూడా గ్లామర్ ఎటాక్ చేయబోతుండటంతో మెహ్రీన్ వారి ముందు ఏమాత్రం నిలుస్తుందన్నదే సందేహం. సినిమా హిట్టయినా.. మెహ్రీన్‌కు ఏమాత్రం క్రెడిట్ వస్తుందో.. ఆమె కెరీర్‌కు ఈ చిత్రం ఎంత వరకు ఉపయోగపడుతుందో అన్న సందేహాలున్నాయి.
ఐతే ప్రస్తుత సినిమాల సంగతి పక్కన పెడితే.. కెరీర్లో ఎప్పుడో మిస్సయిన ఓ సినిమా గురించి మెహ్రీన్ ఇప్పుడు బాధ పడుతోంది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ హిట్టవడంతో తనకు మంచి మంచి ఆఫర్స్ వచ్చాయని, అందులో ‘సరైనోడు’ ఒకటని మెహ్రీన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ముందు కథానాయికగా ఆ సినిమాకు తననే అడిగారని.. కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం చేయలేకపోయానని.. ఆ సినిమా చేసి ఉంటే తన కెరీరే వేరుగా ఉండేదని మెహ్రీన్ వాపోయింది. ఈ సినిమా మిస్సవడం పట్ల తర్వాత తాను చాలా బాధపడినట్లు వెల్లడించింది.
ఇదిలా ఉండగా యుక్త వయసులో తన క్రష్‌ల గురించి చెబుతూ.. సల్మాన్ ఖాన్ అంటే తనకు పిచ్చి అని తెలిపింది మెహ్రీన్. సల్మాన్‌కు, తనకు వయసు అంతరం ఐదేళ్లే ఉన్నట్లయితే.. ఆయన ఏమనుకుంటాడో ఆలోచించకుండా వెళ్లి తనను పెళ్లి చేసుకుంటారా అని అడిగేదాన్నని మెహ్రీన్ తెలిపింది. కాలేజీ రోజుల్లో తనను చాలామంది అబ్బాయిలు ఇష్టపడ్డా.. తాను అప్పట్లో ఫైర్ బ్రాండ్ లాగా ఉండడంతో తమ ప్రేమను చెప్పడానికి భయపడేవారని మెహ్రీన్ తెలిపింది.
This post was last modified on May 23, 2022 10:03 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…