సీనియర్ హీరో రాజశేఖర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. శేఖర్. మలయాళ హిట్ జోసెఫ్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఆయన భార్య జీవిత దర్శకత్వం వహించారు. శేఖర్ విడుదల ముంగిట రాజశేఖర్ మాట్లాడుతూ.. సినిమానే తమకు బతుకు తెరువు అని.. ఈ సినిమాను విజయవంతం చేసి తాను అప్పుల పాలు కాకుండా చూడాలని ప్రేక్షకులకు విన్నవించడం తెలిసిందే. కాగా.. ఈ సినిమాకు ఆశించినంత మంచి టాక్ కానీ, ఓపెనింగ్స్ కానీ రాలేదు. ఇది రాజశేఖర్, జీవితలకు నిరాశ కలిగించే విషయమే.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసమని జీవిత తన వద్ద అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వనందుకు గాను పరంధామరెడ్డి అనే ఫైనాన్షియర్ కోర్టును ఆశ్రయించారు. కాగా.. 48 గంటల్లోపు రూ.65 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్‌గా జీవిత సమర్పించని పక్షంలో శేఖర్ సినిమాకు సంబంధించిన సర్వ హక్కులను ఎటాచ్ చేస్తూ.. ఆ సినిమాను ఎక్కడా ప్రసారం చేయకుండా నిలుపుదల చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లుగా పరంధామరెడ్డి మీడియాకు వెల్లడించారు. దీనిపై రాజశేఖర్ కానీ, జీవిత కానీ స్పందించలేదు. ఐతే ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన బీరం సుధాకర్ రెడ్డి.. పరంధామరెడ్డి ప్రకటనపై రెస్పాండయ్యారు.
శేఖర్ సినిమాకు నిర్మాత జీవిత కాదని, తాను అని, తన సినిమాకు ఎవరైనా నష్టం కలిగిస్తే ఊరుకునేది లేదని సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. హీరోగా నటించిన రాజశేఖర్‌కు, దర్శకురాలిగా బాధ్యతలు నిర్వర్తించిన జీవితకు తాను పూర్తిగా పారితోషకాలు ఇచ్చేశానని, ఈ సినిమా వాళ్లిద్దరిదీ అనుకుని ఎవరో కోర్టుకు వెళ్లారని, తన సినిమాకు వారు నష్టం కలిగిస్తే.. ఏదైనా జరిగితే.. తాను పరువునష్టందావా కేసు వేస్తానని.. తాను నష్టపోయిన మొత్తాన్ని వాళ్ల నుంచి రాబడతానని.. తన సినిమాను ఎవరికీ అమ్మకూడదని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. మరి ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.
This post was last modified on May 22, 2022 7:39 am
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…