Movie News

బిగ్ బాస్ OTT – హిట్టా ఫట్టా

హిందీలో తమిళంలో సూపర్ హిట్ షోగా పేరు తెచ్చుకుని భారీగా ఫాలోయింగ్ పెంచుకున్న బిగ్ బాస్ తెలుగులోనే చాలా పురిటి నొప్పులు పడింది. స్థిరంగా ఒక యాంకర్ లేక రేటింగ్స్ లో కిందా మీద పడుతూ ఎట్టకేలకు అయిదు సీజన్లు పూర్తి చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్, నానిలు దాన్ని నడిపించిన తీరు ఎలా ఉన్నప్పటికీ నాగార్జున తన చేతుల్లోకి తీసుకున్నాక టిఆర్పిలో ఒక స్టాండర్ నెస్ కనిపించింది. అయినా కూడా ఇదేమి బ్లాక్ బస్టర్ అని చెప్పుకునే రేంజ్ లో కాదు కానీ ఉన్నంతలో డీసెంట్ గా పాపులారిటీని పెంచుకుంది.

సరే టీవీలో అయ్యింది కదా ఓటిటిలో ప్రయోగం చేద్దామని డిస్నీ హాట్ స్టార్ వేదికగా ఇరవై నాలుగు గంటల గేమ్ షో అనే నినాదంతో ఫిబ్రవరి చివరిలో మొదలుపెట్టారు. హడావిడి అయితే గట్టిగానే చేశారు కానీ మధ్యలో సాంకేతిక సమస్యలు, ప్రోగ్రాంని ట్వంటీ ఫోర్ బై సెవన్ ఫార్మాట్ లో లైవ్ తో వచ్చిన ఇబ్బందులు కొంత నెగటివ్ గా మారాయి. ఎట్టకేలకు వాటినో కొలిక్కి తెచ్చి ఇవాళ ఫైనల్ ఎపిసోడ్ తో ముగింపు పలికారు. బిందు మాధవి విన్నర్ గా నిలిచి 25 లక్షలు గెలుచుకోగా అఖిల్, శివలు రెండు మూడు స్థానాల్లో నిలిచారు.

ఇక ఈ బిగ్ బాస్ ఓటిటి నాన్ స్టాప్ షో హిట్టా ఫట్టా అనే ప్రశ్న వేసుకుంటే ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాలను అందుకోలేదనే చెప్పాలి. దీనికి వ్యూస్ ఎన్ని వచ్చాయో హాట్ స్టార్ చెబితే తప్ప డేటా బయటికి రాదు. అదే శాటిలైట్ అయితే రేటింగ్స్ సులభంగా తెలిసిపోయేది. రెగ్యులర్ గా టీవీలో టెలికాస్ట్ అవుతున్నప్పుడు వచ్చినంత స్పందన సోషల్ మీడియాలో ఈ ఓటిటి బిగ్ బాస్ కు కనిపించలేదు. నాగార్జున యాంకరింగ్ చేసిన గ్రాండ్ ఫినాలేతో పాటు మరికొన్ని ఎపిసోడ్స్ తప్ప ప్రేక్షకులు ఎగబడి చూసినవి తక్కువే. మరి దీనికి కొనసాగింపు డిజిటల్ గా చేస్తారా లేదో చూడాలి. ఇదేమో కానీ బిగ్ బాస్ 6 ఉంటుందని మాత్రం నాగ్ హింట్ ఇచ్చేశారు.

This post was last modified on May 22, 2022 7:25 am

Share

Recent Posts

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

27 minutes ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

53 minutes ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

1 hour ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

2 hours ago

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

2 hours ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

5 hours ago