ఏ హీరోకయినా మంచి లైనప్ అనేది చాలా ముఖ్యం. అలా కాకుండా కేవలం కథలు నచ్చడంవల్లో , లేదా కమిట్ మెంట్ వల్లో సినిమాలు చేస్తే రిజల్ట్ ఆశించినట్టుగా ఉండదు. అయితే ప్రస్తుతం మెగా స్టార్ చిరు లైనప్ చూస్తే ఫ్యాన్స్ కి అదే డౌట్ రైజ్ అవుతుంది. అవును చిరు చేస్తున్న, చేయబోయే సినిమాలు చూస్తే ఫ్యాన్స్ లో జోష్ రావడం లేదు. ఎనౌన్స్ మెంట్ నుండే మెగా ఫ్యాన్స్ లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
‘ఆచార్య’ తర్వాత చిరు నుండి రాబోయే ఏ ఒక్క సినిమాకు ఆశించిన బజ్ లేదు. ‘లూసిఫర్’ రీమేక్ కోసం అప్పుడెప్పుడో టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసిన డైరెక్టర్ మోహన్ రాజా ని తీసుకొచ్చాడు చిరు. రీమేక్ తీయడంలో అతను దిట్టే అయినప్పటికీ ఫ్యాన్స్ కి ఈ డైరెక్టర్ మీద పెద్దగా హోప్స్ లేవు.
ఇక నెక్స్ట్ మెహర్ రమేష్ ‘భోళా శంకర్’ ఇది కూడా రీమేకే. మెహర్ డైరెక్టర్ చేసిన చేసిన నాలుగు సినిమాలు అపజయం అందుకున్నాయి. దీంతో అసలు మెహర్ కి చిరు ఎందుకు అవకాశం ఇచ్చాడా ? అన్నట్టుగా ఫ్యాన్స్ లో చర్చ నడిచింది. ఇక బాబీకి కూడా సరైన హిట్ లేదు. అతను తీసిన ప్రీవియస్ మూవీ ‘వెంకీ మామ’ కూడా వర్కౌట్ అవ్వలేదు. వెంకీ కుడుముల చిరుని హ్యాండిల్ చేయగలడా ? అనే సందేహాలు ఉన్నాయి. ఇలా మెగాస్టార్ ఎంచుకున్న దర్శకుల్లో వెంకీ కుడుముల మినహా ఎవరూ సక్సెస్ లో లేరు.
చిరుతో పోలిస్తే బాలయ్య లైనప్ బాగుంది. అవును ‘క్రాక్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేనితో మాస్ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఆ తర్వాత కమర్షియల్ కథకి ఎంటర్టైన్ మెంట్ జోడించి హిట్లు కొడుతున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో సినిమా చేయబోతున్నాడు. దాని తర్వాత తనకి మూడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందించిన బోయపాటితో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇలా మూడు సినిమాలు ఫ్యాన్ లోనూ జోష్ తీసుకొచ్చే మరియు ట్రేడ్ వర్గాన్ని ఎట్రాక్ట్ చేసే సినిమాలే. మరి బాలయ్య లెక్క సరిగ్గానే ఉంది కానీ చిరునే లెక్క తప్పారు. అభిమానుల అంచనాలు పెంచే దర్శకులతో ప్లాన్ చేసుకోలేకపోతున్నారు.. మరి చిరు అప్ కమింగ్ మూవీస్ ఏ రేంజ్ హిట్స్ అందుకుంటాయో ?
This post was last modified on May 23, 2022 7:14 am
ఒక ఢీ.. ఒక రెడీ.. ఒక కింగ్.. ఒక దూకుడు.. ఇలా ఒక దశ వరకు మామూలు హిట్లు ఇవ్వలేదు…
లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించడంలో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం తొలిసారి `విజయ్ దివస్` పేరుతో కీలక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నెల 9న(మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా…
ఒకప్పుడు గోవా అంటే యూత్ కి అదో డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్ తో ప్లాన్ వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గోవానే.…
కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్ కేసులో హీరో దిలీప్కు ఎనిమిదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ దక్కింది. ఎర్నాకులం కోర్టు…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…