సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. తన మార్క్ టైమింగ్ తో ఎన్నో సినిమాల్లో నవ్వుల పూవులు పూయించాడు. కేరెక్టర్ లో దమ్ముంటే వెంకీ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాలే ఇందుకు ఉదాహరణ. వెంకీ కామెడీ టైమింగ్ వల్లే ఆ సినిమాలు పెద్ద హిట్టయ్యాయి. ‘F2’ సినిమా ఆ రేంజ్ సక్సెస్ అందుకోవడానికి కూడా మెయిన్ రీజన్ వెంకీ కామెడీనే. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే.
అయితే ఇప్పుడు F2 కి ఫ్రాంచైజీకి తెరకెక్కిన F3 సక్సెస్ కూడా వెంకీ మీదే డిపెండ్ అయి ఉంది. F2 లో వెంకీ తన కామెడీ టైమింగ్ తో హిలేరియస్ గా నవ్వించాడు. తమన్నా తో ఇంట్లో వచ్చే సీన్స్ , ‘కాపురం ఎక్కడ చేస్తాను నా తలకాయ్’ అంటూ కోపంతో చెప్పే సీన్ , డిఫరెంట్ సౌండింగ్ తో నవ్వడం , మేనరిజమ్స్ , అలాగే డాగ్ తో తన భాద చెప్పుకునే సీన్ ఇలా చాలానే థియేటర్స్ లో బాగా పేలాయి. ఇక F3 కి వచ్చే సరికి చాలా మంది కమెడియన్స్ యాడ్ అయ్యారు. ముఖ్యంగా సునీల్ కూడా వచ్చాడు. కానీ ఎవరున్నా ఎంత మంది కామెడీ చేసినా ఈ ఫ్రాంచైజీలో వెంకీ కామెడీ పండితేనే సినిమా పెద్ద హిట్ అవుతుంది.
వెంకీ తన రియాక్షన్ తో అవతలి నటుడు నుండి కామెడీ రాబట్టడంలో దిట్ట. సో మిగతా నటులు ఎంత ఎంటర్టైన్ చేసినా వెంకీ కామెడీ ని బట్టే అక్కడ సీన్ పండుతుంది. ఈసారి రే చీకటి కూడా వెంకీ కేరెక్టర్ కి ఇంకాస్త బలం చేకూర్చింది. ట్రైలర్ లో ఓ సీన్ చూస్తే సినిమాలో నైట్ బ్లైండ్ నెస్ తో వెంకీ ఎలా ఎంటర్టైన్ చేస్తాడో అర్థమవుతుంది. ఈసారి వెంకీ ని గట్టిగా వాడుకునేలా ఆ కేరెక్టర్ ని డిజైన్ చేసుకున్నాడు అనిల్ రావిపూడి. విక్టరీ కామెడీ వర్కౌట్ అయితే మాత్రం సినిమా F2 ని మించి కలెక్ట్ చేయడం ఖాయం. అందులో డౌటే లేదు.
This post was last modified on May 21, 2022 9:07 pm
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…