‘సర్కారు వారి పాట’ బుకింగ్స్ కొద్దిగా డ్రాప్ అయ్యాయి. టీంతో పాటు మహేష్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ అన్నట్టుగా చెప్పుకున్నారు. కానీ గ్రౌండ్ కెళ్ళి చూస్తే సినిమా ఆ రేంజ్ హిట్ సాధించలేదు. తాజాగా సినిమా రిలీజై పది రోజులు గడవకుండానే తెలంగాణాలో మోస్తరుగా బుకింగ్స్ పడిపోయాయి. ఇక ఆంధ్రాలో కూడా ఫుల్స్ పడట్లేదు. 40 , 50 పర్సెంట్ మాత్రమే థియేటర్స్ ఫిల్ అవుతున్నాయి. ఈ క్రమంలో మళ్ళీ మహేష్ రంగంలోకి దిగాడు.
ఫ్యాన్స్ మీట్ అంటూ సినిమా గురించి ఓ ఇంటరాక్షన్ పెట్టుకున్నాడు. కీర్తి , పరశురాం కూడా పాల్గొన్నారు. అక్కడ ఫ్యాన్స్ సినిమా గురించి, మహేష్ అందం గురించి కన్వర్షన్ జరిగింది. ఆ వీడియోని తాజాగా మీడియాకిచ్చి డ్రాప్ అవుతున్న బుకింగ్ ని మళ్ళీ లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక మహేష్ రిలీజ్ కి ముందు సినిమా ప్రమోషన్స్ లో ఎంత చురుగ్గా పాల్గొంటాడో రిలీజ్ తర్వాత కూడా అంతే ఉత్సాహంతో పార్టిసిపెంట్ చేస్తాడు.
‘భరత్ అనే నేను’,మహర్షి’ సినిమాలకు కూడా ఇలాగే ఇంటరాక్షన్ పెట్టుకొని పోస్ట్ రిలీజ్ ఆ సినిమాలను మళ్ళీ ప్రమోట్ చేశాడు మహేష్. ‘భరత్ అనే నేను’ పోస్ట్ ప్రమోషన్ కోసం అప్పట్లో కేటీఆర్ ని తీసుకొచ్చారు. ‘మహర్షి’ కి రైతులు, ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ ఇంటరాక్షన్ కి యూట్యూబర్స్ కం ఫ్యాన్స్.
ఏదేమైనా సినిమా రిలీజ్ తర్వాత స్టార్ హీరోలు దాన్ని పెద్దగా పట్టించుకోరు. టీం ఇన్వైట్ చేస్తే సక్సెస్ మీట్ కి వచ్చి నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోతారు. కానీ ఓ స్టార్ హీరో ఇలా రిలీజ్ తర్వాత డ్రాప్ అవుతున్న బుకింగ్స్ ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ పబ్లిసిటీ చేయడం అంటే అది ఒక్క మహేష్ కే చెల్లింది. మరి మహేష్ మళ్ళీ రంగంలో దిగి సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు కనుక ప్రేక్షకుల చూపు ఆకట్టుకొని బుకింగ్స్ జోరందుకునే అవకాశం ఉంది.
This post was last modified on May 21, 2022 9:04 pm
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…