ఈసారి కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో చాలామంది ఇండియన్ హీరోయిన్లు పాల్గొన్నారు. ఐతే కేన్స్‌కు బాగా అలవాటు పడ్డ ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొనే లాంటి బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లను మించి.. పూజా హెగ్డే బాగా హైలైట్ అయిందక్కడ. తనదైన అందం, స్టైలింగ్, ప్రెజెన్స్‌తో పూజా అందరి చూపులనూ కట్టిపడేసింది. ఇదంతా చూసి పూజా ప్రిపరేషన్ సూపర్ అని అందరూ కొనియాడారు.
కానీ వాస్తవం ఏంటంటే.. కేన్స్‌కు వెళ్లే ముందు పూజాకు చేదు అనుభవం ఎదురైందట. ఆమె సన్నాహాలపై తీవ్ర ప్రభావం పడిందట. ఇండియా నుంచి రెండు బ్యాగులు తీసుకుని కేన్స్‌కు బయల్దేరగా.. ఎయిర్ పోర్టులో అభ్యంతరం చెప్పడం వల్ల ఒక బ్యాగ్ ఇక్కడే పెట్టేయాల్సి వచ్చిందట. ఇంకో బ్యాగ్‌తో విమానం ఎక్కగా.. ప్రయాణ మార్గంలో అది కూడా పోయిందట. దీంతో కేన్స్‌లో తళుక్కుమనేందుకు వెంట తెచ్చుకున్న వస్తువులేవీ లేకుండా ఉత్త చేతులతో నిలబడాల్సి వచ్చిందట పూజా.
ఫ్రాన్స్‌లో తాను పోగొట్టుకున్న బ్యాగులోనే బట్టలు, మేకప్, ఇతర సామగ్రి అన్నీ ఉన్నాయని.. ఇదంతా తాను రెడ్ కార్పెట్ మీద నడవడానికి కొన్ని గంటల ముందు జరిగిందని పూజా వెల్లడించింది.
జరిగిందాని పట్ల ఏడవడానికి కూడా టైం లేదని.. అప్పుడేం చేయాలో అర్థం కాలేదని.. ఐతే తన టీం సహకారంతో తేరుకున్నానని.. వెంటనే షాపింగ్ చేసి కేన్స్ కోసం కొత్త డ్రెస్ కొన్నానని.. తన టీం సభ్యులు మేకప్, ఇతర సామగ్రి అంతా తీసుకొచ్చారని.. జువెలరీ హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకోవడం వల్ల మంచిదైదని.. మొత్తంగా అప్పటికప్పుడు సమకూర్చుకున్న వాటితోనే రెడీ అయి కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లి రెడ్ కార్పెట్ మీద నడిచానని.. అక్కడ మంచి స్పందన రావడంతో హమ్మయ్య అనుకున్నానని పూజా వెల్లడించింది. ఈ హడావుడి వల్ల ఒక రోజంతా ఏమీ తినలేదని.. రెడ్ కార్పెట్ వాక్ తర్వాత తనతో పాటు టీం అంతా కలిసి డిన్నర్ చేసిందని, వాళ్లు అందించిన మద్దతును ఎప్పటికీ మరిచిపోలేనని పూజా తెలిపింది.
This post was last modified on May 21, 2022 7:02 am
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…