ఒక సినిమా తీసి దాన్ని విడుదల చేసే క్రమంలో ప్రమోషన్ ఎంత కీలక పాత్ర పోషిస్తుందో చూస్తున్నాం. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ దేశమంతా తిరగాల్సి వచ్చింది. మహేష్ బాబు మొదటిసారి స్టేజి మీద డాన్స్ చేసే భాగ్యం కలిగించింది. తారలు థియేటర్లు షాపింగ్ మాళ్లు స్వయంగా చుట్టేసి మరీ ప్రచారం చేస్తున్నారు. అలాంటిది ఏ మాత్రం బజ్ లేని ఒక చిన్న మూవీని రిలీజ్ చేస్తున్నప్పుడు అది వచ్చిందన్న సంగతి ప్రేక్షకులకు తెలిసేలా ఏదో ఒకటి చేయాలి. లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం.
కొద్దోగొప్పో మంచి క్యాస్టింగ్ ఉన్న శేఖర్ కే మొదటి రోజు ఓపెనింగ్స్ లేవు. అలాంటిది దానికి పోటీగా వచ్చిన డేగల బాబ్జీని పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. తమిళంలో మంచి విజయం సాధించి పార్తీబన్ కు నేషనల్ అవార్డు తీసుకొచ్చిన ఉత్త సెరిప్పు సైజ్ 7 అఫీషియల్ రీమేక్ ఇది. ఇందులో ఆయన తప్ప వేరే ఆర్టిస్టులు ఉండరు. కేవలం డబ్బింగ్ రూపంలో గొంతులు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి. అక్కడ కమర్షియల్ గానూ దాని బడ్జెట్ కు తగ్గట్టు బాగానే ఆడింది. మరి మన నిర్మాతలు తెలుగులో ఏ నమ్మకంతో ఆడుతుందని తీసుకొచ్చారో బండ్ల గణేష్ ని ఒప్పించేసి మొత్తానికి చకచకా షూటింగ్ పూర్తి చేసి హాలు దాకా తెచ్చారు.
కానీ కనీస ప్రచారం లేకపోవడంతో డేగల బాబ్జీ వసూళ్లు నామమాత్రంగా వచ్చాయి. స్క్రీన్లు కూడా అంతంత మాత్రంగా దక్కాయి. కొన్ని జిల్లా కేంద్రాల్లో అసలు రిలీజ్ కూడా కాలేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు సపోర్ట్ చేస్తారనుకుంటే అదీ జరగలేదు. అయినా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో మసాలా స్పీచులు ఇచ్చినంత మాత్రాన పొలోమని మొదటిరోజే వచ్చేస్తారా. దీనికి తోడు చూసిన కొద్దోగొప్పో ఆడియన్స్ కూడా పెదవి విరుస్తున్నారు. ఏదో ఓటిటి అంటే ఓకే కానీ ఇలా బండ్లన్నని సోలోగా అంతసేపు బిగ్ స్క్రీన్ మీద చూడలేకపోయామంటున్నారు.
This post was last modified on May 21, 2022 6:39 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…