‘కేజీఎఫ్’తో ప్రేక్షకులందరినీ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాలోని హీరో ఎలివేషన్లు, మాస్ సన్నివేశాలు కొత్తేమీ కాదు కానీ.. వాటిని ప్రశాంత్ తనదైన శైలిలో ప్రెజెంట్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కోల్ బ్యాక్ డ్రాప్ ఎంచుకోవడం సినిమాకు విజువల్‌గా కొత్త కలర్ ఇచ్చింది. ఐతే ఈ నేపథ్యాన్ని ప్రశాంత్ ఆ ఒక్క సినిమాకు పరిమితం చేయడం లేదు.
‘కేజీఎఫ్’ తర్వాత అతను తెరకెక్కిస్తున్న ‘సలార్’ ఫస్ట్ లుక్, ఇతర ప్రోమోలు, ఆన్ లొకేషన్ ఫొటోలు చూస్తే.. ‘కేజీఎఫ్’ శైలి కొనసాగబోతోందని అర్థమైంది. వీటిలోనూ కోల్ బ్యాక్ డ్రాప్ ఉంటుందేమో అనిపించేలాగే పోస్టర్లు తయారయ్యాయి. దీని మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జోక్స్, మీమ్స్ కూడా వస్తున్నాయి ముందు నుంచి. ‘సలార్’లో జగపతిబాబు లుక్ చూసినా.. ముఖానికి బొగ్గు పూసుకున్నట్లు కనిపించాడు.
అంతకుముందు ప్రభాస్ అంతే. ఇప్పుడు ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ కొత్త సినిమా ప్రి లుక్ రిలీజ్ చేయగా.. అది కూడా భిన్నంగా ఏమీ లేదు. ప్రతి పోస్టర్ కూడా ఒకేలా ఉంటోంది. ప్రశాంత్ నీల్ సినిమా అంటే ఎవ్వరైనా సరే.. ముఖానికి బొగ్గు రాసుకుని కెమెరా ముందు నిలబడ్డమే చేయాలని, అంతకుమించి ఏమీ ఉండదని.. ఏ పోస్టర్ అయినా బొగ్గులో ముంచి తీసినట్లుగానే ఉంటుందని.. ఇలాంటి కామెంట్లు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో.
ఐతే ఒక దశ వరకు ఇలాంటివి బాగానే ఉంటాయి కానీ.. తర్వాత తర్వాత మొనాటనీ అనిపిస్తాయి. ప్రశాంత్ సినిమాల పోస్టర్లంటే ఇప్పటికే ఒక మూస అనే ఫీలింగ్ వచేస్తోంది. మొదట్లో కొత్తగా అనిపించేది ఏదైనా.. మళ్లీ మళ్లీ చూశాక ఇలాగే ఉంటుంది. కాబట్టి ఇకపై పోస్టర్లు మార్చాల్సిందే. దాంతో పాటు కథాంశాల విషయంలోనూ పోలిక లేకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.
This post was last modified on May 20, 2022 7:02 pm
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన స్టైల్లో స్పందించారు. 2027 వరల్డ్…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…
తాను చేసింది మహా పాపమే అంటూ.. పరకామణి చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రవికుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో…
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…