ఏడు అడుగులు నడిచి.. మంత్రోచ్ఛారణ మధ్య ఒకటైన జంట.. జీవితంలో తమకు ఎదురైన సవాళ్లను ఎదుర్కొని.. జంటగా జీవితాన్ని సాగించాలన్నది పాత చింతకాయ పచ్చడిగా మారటమే కాదు.. పెళ్లి చేసుకున్నామా? ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయా? విడిపోదామంతే.. అన్నట్లుగా ఇప్పుడు పరిస్థితి మారింది. మధ్యతరగతి వర్గాలతో పోలిస్తే.. ఎగువ మధ్యతరగతి వర్గాల్లో ఈ తీరు ఎక్కువగా ఉంది. ఇక.. గ్లామర్ ఇండస్ట్రీలో ఇది చాలా రోటీన్ వ్యవహారంగా మారింది. బాలీవుడ్ లో ఈ కల్చర్ ఎప్పటి నుంచో ఉన్నా.. ఇటీవల కాలంలో అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తరచూ ఏదో ఒక జంట విడిపోవటం.. మళ్లీ పెళ్లి చేసుకోవటం లాంటివి పరిపాటిగా మారిందని చెప్పాలి. తాజాగా బాలీవుడ్ కు చెందిన మరో జంట విడాకుల బాట పట్టింది.
బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ (అమీర్ ఖాన్ మేనల్లుడు) ఆయన సతీమణి అవంతిక మాలిక్ తో విడిపోయేందుకు సిద్ధమయ్యారు. దాదాపు ఎనిమిదేళ్లు ప్రేమించుకొని.. పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఏడేళ్ల ‘ఇమారా’ అనే కుమార్తె ఉంది. భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తటంతో పరస్పర అంగీకారంతో వారు విడిపోతున్నట్లుగా చెబుతున్నారు. 2008లో జానే తు యా జానే నా మూవీలో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఇమ్రాన్ తర్వాతి కాలంలో పలు సినిమాల్లో నటించాడు. అతడి చివరి సినిమా కట్టి బట్టి 2015లో విడుదలైంది. ఆ తర్వాత నుంచి అతడు సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.
ప్రేమించిన అవంతికను 2011లో పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. పెళ్లైన కొంతకాలం వారి వైవాహిక జీవితం సాఫీగా సాగినా.. ఆ తర్వాత విభేదాలు తలెత్తటంతో వారు విడిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో సన్నిహితులు.. బంధువులు వీరిని కలిపేందుకు ఎంతగా ప్రయత్నించిన కుదర్లేదంటారు. సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వీరు 2019 నుంచి విడివిడిగా ఉన్నట్లు చెబుతున్నారు. తాజాగా వీరు విడాకులకు సిద్ధమైనట్లుగా చెబుతున్నారు.
This post was last modified on May 20, 2022 10:45 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…