రేపు తారక్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ 30 అనౌన్స్ చేస్తూ వదిలిన చిన్న వీడియో బైట్ ఆన్ లైన్ లో ట్రెండ్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ వెయ్యి కోట్లు వసూలు చేసిన ఇండస్ట్రీ హిట్ అయినా విజయాన్ని చరణ్ తో పంచుకోవాల్సి రావడంతో తారక్ ఫ్యాన్స్ సోలో మూవీ కోసం ఎదురు చూస్తున్నారు.
చిరంజీవి చరణ్ కాంబోలో భారీ అంచనాలతో ఆచార్య బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ రూపంలో దారుణంగా నిరాశ పరిచినప్పటికీ జనతా గ్యారేజ్ కాంబినేషన్ కావడంతో ఈసారి కొరటాల శివ ఎలాంటి పొరపాటు చేయరనే ధీమాతో ఉన్నారు.
కాకపోతే ఇప్పుడు వదిలిన ప్రోమో, బ్యాక్ గ్రౌండ్ సెటప్ అంతా చూస్తుంటే గతంలో అల్లు అర్జున్ తో చేయబోతూ అఫీషియల్ గా ప్రకటించాక డ్రాప్ అయిన ప్రాజెక్టే గుర్తొస్తోంది. జూనియర్ గొంతులో మంచి పవర్ ఫుల్ డైలాగు కూడా చెప్పించారు. అవసరానికి మించిన ధైర్యం, అవసరమైనప్పుడు భయం రావడం గురించి బలమైన సంభాషణే ఉంది. టైటిల్ రివీల్ చేయలేదు కానీ చేతిలో ఆయుధాలతో సముద్రం, లైట్ హౌస్, ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు మొత్తానికి సెటప్ మాత్రం ఆసక్తికరంగా ఉంది.
అప్పుడు కారణాలు ఏవైనా బన్నీ తీసుకున్న నిర్ణయం కరెక్టో కాదో ఈ సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది. అనిరుద్ రవిచందర్ సంగీతం, రత్నవేలు ఛాయాగ్రహణం, సాబు సిరిల్ సౌండ్ డిజైన్ మొత్తానికి ప్యాన్ ఇండియా లెవెల్ లో ఉండాల్సిన టీమ్ ని పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్న కొరటాల శివ తన మీద పడ్డ ఆచార్య మరకను తుడుచుకోవాలంటే దీన్ని బ్లాక్ బస్టర్ చేసే తీరాలి. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్న ఈ క్రేజీ మూవీకి హీరోయిన్ కోసం ఇద్దరు బాలీవుడ్ ఆప్షన్స్ ని చూస్తున్నారు. ఇంకా ఫైనల్ కాలేదు.
This post was last modified on May 20, 2022 7:37 am
వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీక్‌కు సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ చేసిన నిరసన…
ఒక ప్రాంతానికి సంబంధించిన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీసేటప్పుడు యాస విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైలాగులు రాయడం…
తాజాగా మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలే హవా చూపించాయి.…
బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం…
తమిళనాడు బై ఎలక్షన్లలో అధికార టీవీకే పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. శుక్రవారం ఉదయం కౌంటింగ్ మొదలైన తర్వాత తొలి…
ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…