Movie News

మంచి సినిమా.. రాజశేఖర్‌ను నిలబెడుతుందా?

తెలుగులో అత్యధిక రీమేక్‌లు చేసిన పెద్ద హీరో ఎవరు అంటే మరో మాట లేకుండా రాజశేఖర్ పేరు చెప్పేయొచ్చు. హీరోగా పీక్స్‌లో ఉన్న టైం నుంచి ఆయన రీమేక్‌లు చేస్తూనే వస్తున్నాడు. కెరీర్లో డౌన్ అయ్యాక మరింతగా ఆయన రీమేక్స్‌ను నమ్ముకున్నాడు. తమిళ, మలయాళ సినిమాలను రెగ్యులర్‌గా ఫాలో అవుతూ.. మంచి మంచి సినిమాలు చూసి తెలుగులో చేస్తుంటాడు కానీ వాటిని సరిగా తీయడంలో ఫెయిలవడం వల్ల ఆయనకు ఎదురు దెబ్బలు తగులుతుంటాయి.

గత రెండు దశాబ్దాల్లో ‘ఎవడైతే నాకేంటి’ సినిమాలు తప్ప మిగతా రీమేక్స్ అన్నీ ఆయనకు నిరాశనే మిగిల్చాయి. తమిళంలో బ్లాక్‌బస్టర్ అయిన ‘సూదుకవ్వుం’ను తెలుగులో ‘గడ్డం గ్యాంగ్’గా తీస్తే దారుణమైన ఫలితాన్నందుకుంది. ఇప్పుడు కొంచెం గ్యాప్ తర్వాత ఆయన మళ్లీ ఓ రీమేక్‌లో నటించారు. అదే.. శేఖర్. మలయాళంలో విజయవంతమైన ‘జోసెఫ్’కు ఇది రీమేక్.

మెడికల్ మాఫియా చుట్టూ చాలా వినూత్నంగా, ఉత్కంఠభరితంగా సాగే సినిమా ‘జోసెఫ్’. జోజు జార్జ్ ఇందులో లీడ్ రోల్ చేశాడు. వీఆర్ఎస్ తీసుకున్న నడివయస్కుడైన పోలీస్.. తన కూతురి మరణం చుట్టూ నెలకొన్న మిస్టరీని ఛేదించే క్రమంలో ఈ సినిమా నడుస్తుంది. కథలో ఎన్నో మలుపులుంటాయి. మంచి ఎమోషన్, అలాగే ఉత్కంఠ ఉంటుంది.

ఐతే ఒరిజినల్ ఎలా ఉన్నా ఇక్కడ రాజశేఖర్, జీవిత కలిసి ఆ సినిమా ఎలా తీశారన్నదే ప్రశ్నార్థకం. పైగా ఈ రోజుల్లో చిన్న, మీడియం రేంజ్ సినిమాలు చూడ్డానికి జనాలు థియేటర్లకు రావడం కష్టమైపోతోంది. ‘శేఖర్’కు బజ్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఈ సినిమా ఆడకుంటే తాను అప్పులపాలవుతానంటూ రాజశేఖర్ ప్రేక్షకుల్లో సానుభూతి కోసం ప్రయత్నించాడు. అది అయినా ప్రేక్షకులను, ఆయన అభిమానులను కదిలించి థియేటర్లకు తీసుకొస్తుందేమో చూడాలి. ఇంతకీ ఈ సినిమాకు రివ్యూలు, మౌత్ టాక్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రంతో పాటు బండ్ల గణేష్ సినిమా ‘డేగల బాబ్జీ’, సంపూర్ణేష్ బాబు మూవీ ‘ధగడ్ సాంబ’ కూడా రిలీజవుతున్నాయి కానీ.. వాటికి అసలే బజ్ లేదు.

This post was last modified on May 20, 2022 10:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

9 hours ago