అసాధారణంగా పెంచేసిన టికెట్ల రేట్ల తాలూకు ప్రతికూల ప్రభావం టాలీవుడ్‌కు ఇప్పుడు బాగానే అర్థమవుతున్నట్లుంది. చిరంజీవి, మహేష్ బాబు లాంటి స్టార్ల సినిమాలకు వీకెండ్లోనే థియేటర్లు నిండని పరిస్థితి కనిపించే సరికి తీవ్రత ఏంటో అందరికీ తెలిసొచ్చింది. వీకెండ్ తర్వాత ఈ రెండు చిత్రాల థియేటర్లు వెలవెలబోయాయి.
ఓ వర్గం ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారని స్వయంగా అగ్ర నిర్మాత దిల్ రాజు స్టేట్మెంట్ ఇచ్చాడంటే టికెట్ల రేట్ల తాలూకు దెబ్బ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. రాజు సినిమా ఎఫ్-3కి అదనపు రేట్ల పెంపు కోరుకుంటే ఈజీగానే అనుమతులు వచ్చేస్తాయి.
అయినా సరే.. రాజు అత్యాశకు పోలేదు. సాధారణ రేట్లతోనే సినిమాను రిలీజ్ చేస్తున్నారు. కానీ ఆ రేట్లు కూడా ఎక్కువే అన్న అభిప్రాయాలు జనాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఎఫ్-3కి క్రేజ్ ఉంది కాబట్టి ఓకే కానీ.. ఈ వారం రిలీజవుతున్న శేఖర్ లాంటి సినిమాలకు సింగిల్ స్క్రీన్లలో 175, మల్టీప్లెక్సుల్లో 295 అన్నా కూడా ఎక్కువ రేటే.
అందుకే సింగిల్ స్క్రీన్ల రేటును రూ.150కి, మల్టీప్లెక్సుల రేట్లను 150-200 మధ్య పెట్టి సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ప్రీమియం మల్టీప్లెక్సుల్లో కూడా దీనికి రూ.295 రేటు లేదు. రేట్లు తగ్గించడమే కాక.. పోస్టర్ మీద సాధారణ ధరలతో అని స్టాంప్ వేసి మరీ సినిమాను రిలీజ్ చేస్తుండటం గమనార్హం.
ఇలా టికెట్ల ధరల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో టాలీవుడ్ ఆలోచించాలి. ప్రభుత్వం అనుమతులు ఇస్తోంది కదా అని అయినకాడికి రేట్లు పెంచేశారు. దెబ్బకు రెగ్యులర్ ఆడియన్స్ థియేటర్లకు రావడం మానేస్తున్నారు. ఆల్రెడీ కొవిడ్ వల్ల సినిమాలు చూసే అలవాటు తగ్గింది.
ఇప్పుడు టికెట్ల రేట్ల దెబ్బకు అది ఇంకా తగ్గిపోయింది. ఇలా అలవాటు తప్పిన వాళ్లను మళ్లీ థియేటర్లకు రప్పించడం అంత తేలిక కాదు. ఎఫ్-3 లాంటి సినిమాకు సింగిల్ స్క్రీన్లో ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలతో కలిపితే రేటు రూ.210 దాటుతోంది. మల్టీప్లెక్సు రేటు రూ.330 మించుతోంది. సింగిల్ స్క్రీన్ రేటు 150, మల్టీప్లెక్స్ రేటు 200కు అటు ఇటుగా ఉంటే ఫ్యామిలీస్ ఇలాంటి సినిమాలను పెద్ద ఎత్తున చూసి, ఆక్యుపెన్సీ పెరిగే అవకాశముంది.
This post was last modified on May 20, 2022 7:31 am
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…