తమ కుటుంబ సభ్యుల గురించి సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నటి, దర్శకురాలు జీవిత రాజశేఖర్. ముఖ్యంగా తన కూతుళ్ల గురించి యూట్యూబ్‌లో దారుణమైన థంబ్ నైల్స్ పెడుతున్నారని ఆమె మండిపడ్డారు. “మా మీద వచ్చినన్ని వార్తలు ఇంకెవరి మీదా రావేమో. మొన్నా మధ్య నా కూతురు బాయ్ ఫ్రెండ్‌తో దుబాయ్‌కి వెళ్లిందని తప్పుడు ప్రచారం చేశారు. ఒకసారి శివాత్మిక అంటారు. ఇంకోసారి శివాని పేరు తెస్తారు. ప్రియుడితో పారిపోయిందని రాస్తారు.. యూట్యూబ్‌లో ఏదో థంబ్ నైల్ పెడతారు. వార్తల్లోనూ ఏదో హెడ్డింగ్ ఉంటుంది. తీరా ఓపెన్ చేసి చూస్తే అక్కడున్న మేటర్‌కి, టైటిల్‌కి సంబంధం ఉండదు. మా కుటుంబం అంతా కలిసి దుబాయికి వెళ్తే.. మా అమ్మాయి తన లవర్‌తో దుబాయ్‌కి వెళ్లిందని రాస్తారు. ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తే చాలా జీవితాలు ప్రభావితం అవుతాయి” అని జీవిత వ్యాఖ్యానించారు.
తన దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన ‘శేఖర్’ విడుదల నేపథ్యంలో మీడియాను కలిసిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘గరుడవేగ’ సినిమాకు సంబంధించిన ఆర్థిక వివాదం గురించి మీడియా వాళ్లు అడగ్గా.. ఆ వ్యవహారం కోర్టులో ఉందని, కానీ ఈలోపే తమ గురించి ఏదేదో రాసేస్తున్నారని.. నిజంగా తాము తప్పు చేశామంటే రోడ్డు మీద నిలబెట్టినా భరిస్తామని.. కానీ నిజాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేయొద్దని ఆమె కోరారు.
‘శేఖర్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఒక కులాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన నేపథ్యంలో జీవిత స్పందించారు. తాను ఒకలా చెబితే జనాలు మరోలా అర్థం చేసుకున్నారని.. ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని జీవిత అన్నారు. తన కూతురు డబ్బుల విషయంలో అస్సలు రాజీ పడదని చెబుతూ.. “కోమటిదాని లెక్క” అనే మాటను ‘శేఖర్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో జీవిత వాడడం దుమారం రేపి, ఆర్యవైశ్యుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
This post was last modified on May 19, 2022 5:24 pm
సౌతాఫ్రికా సిరీస్‌లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్‌లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…
రీఎంట్రీ తర్వాత వరుసగా మూడు రీమేక్‌లతో పలకరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలో రెండు…
మన శంకరవరప్రసాద్ గారు నుంచి మరో పాట వచ్చేసింది. నిజానికీ రిలీజ్ రేపు జరగాలి. కానీ ఒక రోజు ముందుగా…