డిస్ట్రిబ్యూషన్ రంగం నుండి అగ్ర నిర్మాతగా ఎదిగిన దిల్ రాజు నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. బడా సినిమాల రిలీజ్ విషయంలోనూ టికెట్ ఇష్యూ లోనో ఇలా ఏదొక మేటర్ లో రాజు గారి పేరు ఎక్కువగా వినబడుతుంది. ఇటివలే బడా సినిమాలకు సంబంధించి టికెట్ రేట్ పెరగడానికి దిల్ రాజే కారణమంటూ అందరూ మాట్లాడుకున్నారు. ఇక ప్రతీ సారి దిల్ రాజే చేశాడంటూ గ్రౌండ్ తెలియకుండా తన గురించి నెగిటివ్ గా మాట్లాడుకోవడం అస్సలు నచ్చట్లేదని చెప్పుకున్నారు దిల్ రాజు.
తాజాగా F3 ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన దిల్ రాజు తనకి నైజాంలో కేవలం అరవై థియేటర్స్ మాత్రమే ఉన్నాయని ఇవి తెలియకుండా నైజాం థియేటర్స్ అన్నీ రాజు కిందే ఉన్నాయని చెప్పుకోవడం తప్పని అన్నారు. ఇక టికెట్ రేటు పెరగడం వెనుక చాలా మంది ఉంటారని ముఖ్యంగా ఆ సినిమా నిర్మాత మీదే టికెట్ రేటు పెంచడం తగ్గించడం అనేది ఉంటుందని డిస్ట్రి బ్యూటర్ గా తన పాత్ర చాలా తక్కువని చెప్పుకున్నారు.
ఇక F3 లాంటి క్రేజీ ప్రాజెక్ట్ ను పెట్టుకొని సాధారణ టికెట్ రేటుకే సినిమా చూపించడానికి రీజన్ ఉందని, ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి సినిమా చూడాలని అలాగే టికెట్ రేటు పెరగడం ఇండస్ట్రీకి కూడా ఎఫెక్ట్ అవుతుందని ఇలాగే చూస్తూ ఉంటే డేంజర్ జోన్ లోకి వెళ్లిపోతామని అందుకే ముందుగా తనే ఈ నిర్ణయం తీసుకొని ముందడుగు వేశానని తెలిపారు. అలాగే ఎవరైనా నిర్మాత నేను డిస్ట్రి బ్యూట్ చేసే సినిమాల రేటు పెంచమని అడిగేందుకు వీలు లేకుండా చేసే ప్రయత్నమిదని అన్నారు. ఏదేమైనా సినిమా ప్రమోషన్స్ లో సినిమా గురించి కాకుండా తనను తిట్టుకుంటూ ప్రతీ సారి బురద జల్లే వారి మీద తన ఫ్రస్ట్రేషన్ చూపించారు దిల్ రాజు.
This post was last modified on May 19, 2022 5:19 pm
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…