కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న NTR30 కి సంబంధించి ఇంకా హీరోయిన్ ఫైనల్ అవ్వలేదు. కొరటాల అండ్ టీం ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ని లిస్టౌట్ చేశారు. అందులో ఎక్కువ మంది బాలీవుడ్ నుంచే ఉన్నారు. అవును ఈసారి ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని పెట్టే ఆలోచనలో ఉన్నాడు కొరటాల. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొందరు హీరోయిన్స్ ని అనుకున్నారు. అందులో కియరా అద్వానీ పేరు కూడా ఉంది. అయితే కియరా రామ్ చరణ్ -శంకర్ సినిమాకు సైన్ చేయడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయింది.
ప్రస్తుతం కొరటాల దీపిక పదుకొనే ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఇటివలే ఆమెకి స్క్రిప్ట్ పంపించి చర్చలు జరిపారట. ప్రస్తుతం దీపిక ప్రభాస్ తో ‘ప్రాజెక్ట్ కే’ సినిమా చేస్తుంది. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వనుంది. అందుకే కొరటాల ఎన్టీఆర్30 కి ఆమెను ఫిక్స్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. ప్రస్తుతానికయితే దీపికా ఇంకా ప్రాజెక్ట్ ఫైనల్ చేయలేదు. ఇంకా డిస్కషన్ స్టేజిలో ఉంది.
‘జనతా గ్యారేజ్’ తర్వాత కాస్త గ్యాప్ తో వస్తున్న ఈ కాంబో సినిమా మీద భారీ అంచనాలున్నాయి. పైగా ఈసారి పాన్ ఇండియా లెవెల్ కంటెంట్ అంటూ ఎనౌన్స్ మెంట్ తోనే ఎగ్జైట్ మెంట్ కలిగించారు. ఈ సినిమాకు సంబంధించి చాలా కేర్ తీసుకుంటున్నాడు కొరటాల. ‘ఆచార్య’ ఫెయిల్యుర్ నుండి ఎలాగైనా బయట పడి ఈ సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియా లెవెల్ లో ఓ భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా రేపు సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ లుక్ తో పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు. మిక్కిలినేని సుధాకర్ , కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దాదాపు 100 కోట్ల బడ్జెట్ పెట్టనున్నారని ఇన్సైడ్ టాక్.
This post was last modified on May 19, 2022 12:02 pm
ఏపీ అసెంబ్లీలో ఓ వింత పరిస్థితి కనిపిస్తోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైపోయిన వైసీపీకి సభలో ప్రధాన…
కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు స్టార్లు లేకపోయినా బ్రహ్మాండంగా ఆదరిస్తారని గతంలో బలగం లాంటివి ఋజువు చేస్తే తాజాగా కోర్ట్…
మే 9 విడుదల కాబోతున్న హరిహర వీరమల్లు కన్నా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి మీదే ఎక్కువ ప్రేముందనేది బహిరంగ…
విడుదలై నెలరోజులు దాటుతున్నా ఛావా పరుగులు ఆగడం లేదు. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ వారాంతం వస్తే చాలు విక్కీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మాట ఇచ్చారంటే.. అది క్షణాల్లో అమలు కావాల్సిందే. ఇదేదో……
ఓ వైపేమో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధికారంలో ఉంటే… విపక్షాలు సైతం తమ కార్యక్రమాలను ఘనంగా…