ప్రస్తుతం కోలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ తో హంగామా చేస్తున్న శివ కార్తికేయన్ సైలెంట్ గా తెలుగు మార్కెటింగ్ మీద ఫోకస్ పెడుతున్నాడు. ఇప్పటికే ‘వరుణ్ డాక్టర్’ తో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి హిట్ కొట్టిన ఈ హీరో తాజాగా ‘డాన్’ సినిమాతో తెలుగులో మరో హిట్ కొట్టాడు. ఈ రెండు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన శివ కార్తికేయ నెక్స్ట్ ‘జాతి రత్నాలు’ దర్శకుడు అనుదీప్ తో డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నాడు. తెలుగు , తమిళ్ బైలింగ్వెల్ గా ఆ సినిమా తెరకెక్కుతుంది.
నిజానికి కామెడీ సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అరవై శాతం నవ్విస్తే చాలు ఈ జోనర్ లో సూపర్ హిట్ కొట్టేయొచ్చు. అందుకే ఈ సక్సెస్ మంత్రాను నమ్ముకొని హీరోగా వరుస హిట్లు కొడుతున్నాడు శివ కార్తికేయన్. ఈ జోనర్ లో రీసెంట్ గా రెండు హిట్లు కొట్టిన ఈ హీరో నెక్స్ట్ కూడా హిలేరియస్ ఎంటర్టైనర్ సినిమాతోనే రాబోతున్నాడు. అనుదీప్ దర్శకుడిగా హిలేరియస్ సినిమా ప్లాన్ చేసుకొని టాలీవుడ్ మార్కెట్ మరింత పెంచుకోవాలని భావిస్తున్నాడు.
నిజానికి తమిళ్ హీరోల్లో కొందరికి మాత్రం తెలుగులో ఇప్పుడు మార్కెట్ ఉంది. ప్రస్తుతం సూర్య, విశాల్, కార్తి ఇలా కొందరు మాత్రమే ఇక్కడ మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ఆ కోవలోకి సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు శివ కార్తికేయన్. మరి డబ్బింగ్ సినిమాతో టాలీవుడ్ లో మంచి వసూళ్ళు అందుకున్న ఈ యంగ్ హీరో డైరెక్ట్ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.
This post was last modified on May 19, 2022 10:00 am
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…