వీకెండ్ వరకు జోరు చూపించి.. వీక్ డేస్ రాగానే కొత్త సినిమాలకు వీక్ అయిపోవడం మామూలే. ఐతే సోమవారం వచ్చాక వసూళ్లు ఏ స్థాయిలో డ్రాప్ అయ్యాయి అన్నదాన్ని బట్టి సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. గత వారాంతంలో విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకున్న మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాట.. వీకెండ్ వరకు బాగానే నిలబడింది. శుక్రవారం వసూళ్ల డ్రాప్ చూసి బయ్యర్లలో ఆందోళన నెలకొన్నా.. శని, ఆదివారాల్లో వసూళ్లు పుంజుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
సోమవారం సక్సెస్ మీట్ పెట్టి హంగామా చేయడంతో ప్రమోషన్ల పరంగా సినిమాకు కలిసొస్తుందని అనుకున్నారు. కానీ ఆ రోజు నుంచి వసూళ్లు మరీ పడిపోయాయి. ఆదివారంతో పోలిస్తే ఓవరాల్ వసూళ్లలో డ్రాప్ 70 శాతానికి పైగానే ఉండడం కలవరానికి గురి చేసింది. ఆ తర్వాతి రోజుల్లో కూడా పరిస్థితి మారలేదు. వసూళ్లు ఇంకా ఇంకా పడిపోతున్నాయి. బుధవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారి పాట థియేటర్లు వెలవెలబోయాయి. బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తే అంతటా పచ్చదనమే కనిపిస్తోంది. హైదరాబాద్ సిటీలో మహేష్ బాబు మల్టీప్లెక్స్ ఏఎంబీ సినిమాస్ మినహాయిస్తే ఎక్కడా ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్ లేదు. షోలు ఆరంభం కావడానికి గంట ముందు కూడా 20 శాతం టికెట్లు కూడా అమ్ముడవని పరిస్థితి కనిపించింది.
ఆంధ్రా ప్రాంతంలో పరిస్థితి అంతో ఇంతో మెరుగే కానీ.. తెలంగాణలో మాత్రం సినిమా పూర్తిగా పడుకుందనే చెప్పాలి. వీకెండ్లో కూడా నైజాం ఏరియాలో ఈ సినిమా అంతగా ఆడలేదు. వసూళ్లు అనుకున్న దానికంటే తక్కువే వచ్చాయి. వీకెండ్ అయ్యాక ఇక్కడ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. టికెట్ల ధరలు ఎక్కువగా ఉండటం గట్టి ప్రభావమే చూపిస్తున్నట్లుంది. గురువారం నుంచి రేట్లు తగ్గిస్తున్నప్పటికీ.. సినిమా ఏమాత్రం పుంజుకుంటుందన్నది సందేహంగానే ఉంది. వీకెండ్లో సినిమా ఏమాత్రం వసూళ్లు రాబట్టి బయ్యర్లను గట్టెక్కిస్తుందో చూడాలి. బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఈ చిత్రం రూ.35-40 కోట్ల దూరంలో ఉండటం గమనార్హం.
This post was last modified on May 19, 2022 8:22 am
పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గొప్ప సక్సెసయ్యాక ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ మీదకు వెళ్తోంది.…
‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్ను పిలిచి సింపుల్గా చేసేస్తారని అనుకున్నారంతా.…
ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ఏడాది ఆమె నుంచి వరుసగా క్రేజీ…
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు,…
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శకుడైనంత మాత్రాన చట్టాలు పాటించరా? అని…