తమిళంలో ఇప్పుడు నంబర్ వన్ హీరో ఎవరు అంటే.. మరో మాట లేకుండా విజయ్ పేరు చెప్పేయాల్సిందే. దశాబ్దాల పాటు అక్కడ ఆధిపత్యం చలాయించిన రజినీకాంత్ గత కొన్నేళ్లలో బాగా డౌన్ అయిపోయాడు. వరుసగా ఆయన సినిమాలు తుస్సుమనిపించడంతో మార్కెట్ బాగా పడిపోయింది. అదే సమయంలో వరుస బ్లాక్‌బస్టర్లతో విజయ్.. ఆయన్ని దాటి ముందుకెళ్లిపోయాడు.
అజిత్ గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ.. విజయ్ సినిమాల బడ్జెట్లు, బిజినెస్, వసూళ్లు వేరుగా ఉంటున్నాయి. ఇటీవలి బీస్ట్ మూవీ ఒక్కటి తేడా కొట్టింది కానీ.. అంతకుముందు అతను వరుసగా బ్లాక్‌బస్టర్లు కొట్టాడు. ప్రస్తుతం అతను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్‌కు వచ్చిన విజయ్.. మధ్యలో గ్యాప్ తీసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ సంతోష్‌లను కలవడం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ విజయ్‌కి సాదర స్వాగతం పలికి అతడితో కాసేపు ముచ్చటించారు కూడా. విజయ్ వెంట వంశీ పైడిపల్లి కూడా ఉన్నాడు. అతడికి తెలంగాణ ప్రభుత్వ పెద్దలు కొందరితో మంచి సంబంధాలున్నాయి. ఇది మామూలు మీటింగేనా.. ఏమైనా ప్రత్యేకత ఉందా అని సినీ, రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
హైదరాబాద్ వచ్చి షూటింగ్ చేసే ప్రతి పర భాషా హీరో ముఖ్యమంత్రిని కలవడం జరగదు. అసలు వాళ్లందరికీ కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టమే. ఐతే విజయ్‌ను వేరే యాంగిల్లో చూడాలిక్కడ. అతడికి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం బలంగా ఉంది. ఆ దిశగా కొన్నేళ్లుగా సంకేతాలు ఇస్తూనే ఉన్నాడు. రజినీ ముందే అస్త్రసన్యాసం చేశాడు. కమల్ ఫెయిలయ్యాడు. ప్రస్తుతం తమిళనాట ప్రతిపక్షం మరీ బలహీనంగా ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో విజయ్ పార్టీ పెట్టడం, ప్రస్తుతం చాలా బలంగా కనిపిస్తున్న డీఎంకే పార్టీకి ఎదురు నిలబడడం ఖాయమనే అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్, కేసీఆర్ మధ్య రాజకీయ చర్చలేమైనా జరిగి ఉంటాయా అన్న చర్చ నడుస్తోంది.
This post was last modified on May 19, 2022 8:12 am
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…