ఆల్రెడీ మహేష్ బాబు లాంటి టాప్ స్టార్‌తో ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి భారీ సినిమా చేశాడు అనిల్ రావిపూడి. ఈ సినిమాతో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్టులో అతను చేరిపోయినట్లే. ఐతే మార్కెట్ పరంగా చాలా పెద్ద స్థాయిలో ఉన్న మహేష్ బాబుతో సినిమా చేశాక కూడా.. నందమూరి బాలకృష్ణతో సినిమా చేయడం తన కల అని ఎప్పట్నుంచో చెబుతూ వస్తున్నాడు.
ఈ మధ్య అంటే బాలయ్య ‘అఖండ’తో భారీ విజయం సాధించాడు కానీ.. దానికి ముందు ఆయన కెరీర్ ఎంత ఇబ్బందికర స్థితిలో ఉందో తెలిసిందే. అప్పుడు కూడా అనిల్.. బాలయ్యను డైరెక్ట్ చేయడం కోసం ఎంతో ఆశగా ఎదురు చూశాడు. గతంలో బాలయ్య హీరోగా ‘రామారావు’ అనే సినిమా చేయడానికి ప్రయత్నించి విఫలమైన అనిల్.. కొన్ని నెలల కిందటే తన అభిమాన కథానాయకుడితో సినిమాకు కమిట్మెంట్ తీసుకున్నాడు. బాలయ్య సైతం అనిల్‌తో సినిమా చేయబోతున్న విషయాన్ని ధ్రువీకరించాడు.
ఐతే ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందన్న దాని మీదే క్లారిటీ లేదు. ఇటు బాలయ్య, అటు అనిల్ వేర్వేరు సినిమాలతో బిజీగా ఉండటంతో దీనిపై స్పష్టత లేకపోయింది. కాగా తన కొత్త చిత్రం ‘ఎఫ్-3’ ప్రమోషన్లలో భాగంగా తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి క్లారిటీ ఇచ్చేశాడు అనిల్. ఈ చిత్రం సెప్టెంబరులో సెట్స్ మీదికి వెళ్తనున్నట్లు చెప్పాడు. బాలయ్యతో కథా చర్చలు జరుగుతున్నాయని, స్క్రిప్టు పనులు చివరి దశలో ఉన్నాయని అతను వెల్లడించాడు. ఐతే ఈ సినిమా ఏ బేనర్లో తెరకెక్కేది అనిల్ చెప్పలేదు.
ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చకచకా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం జులై-ఆగస్టు మధ్య పూర్తయ్యే అవకాశముంది. దసరా రిలీజ్ ఉండొచ్చు. కొంచెం గ్యాప్ తీసుకుని.. అనిల్ సినిమాను బాలయ్య మొదలుపెట్టేసే అవకాశముంది. ‘ఎఫ్-3’ రిలీజ్ తర్వాత అనిల్ బాలయ్య సినిమా స్క్రిప్టు మీదే పూర్తి స్థాయిలో దృష్టిసారించబోతున్నాడు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్‌తోనూ ఓ సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నానని.. దీనికి సంబంధించి ఏదీ ఫైనలైజ్ కాలేదని అనిల్ చెప్పడం విశేషం.
This post was last modified on May 18, 2022 2:15 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…