ఇటీవలే విడుదలైన అశోకవనంలో అర్జున కళ్యాణంతో డీసెంట్ సక్సెస్ అందుకున్న విశ్వక్ సేన్ దాని ఫలితం పట్ల సంతృప్తిగానే ఉన్నట్టు కనిపిస్తోంది. సర్కారు వారి పాట కేవలం వారం గ్యాప్ తో రావడం వల్ల వసూళ్ల మీద ప్రభావం పడింది కానీ లేదంటే రిజల్ట్ ఇంకాస్త మెరుగ్గా ఉండేదన్న మాట వాస్తవం. ఇదిలా ఉండగా విశ్వక్ సేన్ త్వరలో యాక్షన్ కింగ్ అర్జున్ డైరక్షన్ లో నటించబోతున్నట్టు ఫిలింనగర్ టాక్. అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ ప్రాధమికంగా చర్చలు జరిగి ఒక అంగీకారానికి వచ్చినట్టు సమాచారం.
ఇప్పటి జెనెరేషన్ కి అంతగా అవగాహన ఉండకపోవచ్చు కానీ అర్జున్ నటుడిగానే కాదు దర్శకుడిగా రచయితగానూ చెప్పుకోదగ్గ సినిమాలు చేశారు. ముఖ్యంగా 1994లో తీసిన జైహింద్ అప్పట్లో తమిళ తెలుగు రెండు భాషల్లోనూ సూపర్ హిట్. 2002లో బాలకృష్ణ నరసింహనాయుడుని అక్కడ ఎజుమలై పేరుతో రీమేక్ చేసి తనే దర్శకత్వం వహించారు. దాన్నే తిరిగి సింహబలుడు పేరుతో డబ్బింగ్ చేసి వదిలారు. మరీ ఇండస్ట్రీ హిట్లు తీయలేదు కానీ అర్జున్ ఎప్పటికప్పుడు ఈ ప్రయత్నాలైతే చేస్తూ వచ్చారు.
అర్జున్ చివరిగా డైరెక్ట్ చేసిన సినిమాల్లో 2014లో వచ్చిన జైహింద్ 2. ఇదేమంత ఆశించిన స్థాయిలో ఆడలేదు. 2018 ప్రేమబరహా అనే కన్నడ తమిళ్ బైలింగ్వల్ మూవీ తీశారు కానీ అది తెలుగు దాకా రాలేదు. సో మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత మెగా ఫోన్ చేపట్టనుండటం విశేషం. అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు కాబట్టి కన్ఫర్మ్ చేయలేం కానీ ఊరికే ప్రచారం జరగదుగా. అర్జున్ లాంటి అనుభవజ్ఞుడితో కలిసి పనిచేయడం వ్యక్తిగతంగా తానూ దర్శకుడిగా ఎదుగుతున్న విశ్వక్ సేన్ కి ఖచ్చితంగా ఉపయోగపడేదే.
This post was last modified on May 18, 2022 2:00 pm
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…