మలయాళ బ్లాక్‌బస్టర్ అయ్యప్పనుం కోషీయుం తెలుగు రీమేక్ భీమ్లా నాయక్‌కు దర్శకుడిగా సాగర్ చంద్ర పేరైతే పడింది కానీ.. ముందు నుంచి కూడా ఆ సినిమాకు సంబంధించి ఏ క్రెడిట్ అతడికి దక్కినట్లు కనిపించలేదు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అందించింది త్రివిక్రమ్ శ్రీనివాస్ కావడం, మేకింగ్ టైంలోనూ సెట్లోనూ ఉండి అన్నీ తానై నడిపించడం.. సినిమా కోసం ఒక పాట రాయడం.. అలాగే మ్యూజిక్ సిట్టింగ్స్‌లో కూడా కీలక పాత్ర పోషించడంతో ఇది త్రివిక్రమ్ సినిమా అన్న అభిప్రాయమే జనాల్లో కలిగింది.
విడుదల ముంగిట ప్రి రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ వెనుక ఉండి సాగర్ హైలైట్ కావాలని చూసినా.. దాని వల్ల పెద్దగా ఫలితం లేకపోయింది. ఇక రిలీజ్ తర్వాత సంగతి సరేసరి. చాలా సన్నివేశాల్లో, డైలాగుల్లో త్రివిక్రమ్ ముద్ర కనిపించడంతో సాగర్‌ను దర్శకుడిగా గుర్తించి ఈ సినిమా సక్సెస్ క్రెడిట్‌ను అతడికి కట్టబెట్టిన వాళ్లు తక్కువ.
మొత్తంగా చూస్తే.. భీమ్లానాయక్ వల్ల సాగర్‌కు పారితోషకం అంది ఉండొచ్చు కానీ, వేరే ప్రయోజనం మాత్రం ఏమీ లేనట్లే. ఎందుకంటే సినిమా రిలీజై మూడు నెలలు కావస్తున్నా అతడి నుంచి కొత్త అనౌన్స్‌మెంట్లేమీ లేవు. ఒక హిట్ ఇచ్చాడు, పైగా పవన్ కళ్యాణ్‌తో అన్నపుడు వెంటనే అవకాశాలు వెల్లువెత్తాలి. కానీ సాగర్ కొత్త సినిమా కబుర్లేమీ వినిపించడం లేదు. మంగళవారం సాగర్ చంద్ర పుట్టిన రోజు.
అంత పెద్ద సినిమాను డైరెక్ట్ చేసి హిట్టు కొట్టాక మామూలుగా అయితే కొత్త సినిమాల అనౌన్స్‌మెంట్లు ఉండాలి. కానీ అలాంటిదేమీ లేదు. అసలు సోషల్ మీడియాలో సందడే లేదు. పవన్ ఫ్యాన్స్ సైతం అతణ్ని పెద్దగా ఓన్ చేసుకున్నట్లుగా కనిపించలేదు. నిజానికి భీమ్లా నాయక్ కంటే ముందు తీసిన అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు చిత్రాలతో సాగర్‌కు మంచి పేరొచ్చింది. కానీ అవి కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ కాకపోవడంతో కెరీర్ ముందుకు సాగలేదు. అలాంటి టైంలో భీమ్లా నాయక్ లాంటి పెద్ద సినిమాను బాగానే డీల్ చేసినా.. దాని సక్సెస్ క్రెడిట్ మాత్రం ఏమీ సాగర్‌కు దక్కక అతడి కెరీర్‌కు మరోసారి బ్రేక్ పడ్డట్లే కనిపిస్తోంది.
This post was last modified on May 18, 2022 2:18 pm
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి ఇప్పుడు బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ప్రత్యేకమైన సిరీస్‌గా నిలవనుంది. ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో…
అభిమానుల నిరీక్షణకు తెర దించుతూ ‘పుష్ప: ది రూల్’ ట్రైలర్ నిన్న సాయంత్రం రానే వచ్చింది. వచ్చీ రాగానే సోషల్…
ఏపీ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్.. అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలను ఆయన రాబందులతో పోల్చారు. రాబందుల…
గత కొన్నాళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హల్చల్ సృష్టిస్తున్న మహిళా అఘోరి వ్యవహారం మరింత ముదురుతోంది. పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ..…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ మాట్లాడిన విధానం అక్కడి జనాలను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా హిందువులపై జరిగిన దాడులపై…
ఇండియా నుంచి అమెరికా విమాన ప్రయాణానికి 18 గంటలు పడుతుందని మీరు ఆలోచిస్తున్నారా? అయితే త్వరలో అది కేవలం నిమిషాల్లోనే…