Movie News

క‌శ్మీర్ ఫైల్స్ డైరెక్ట‌ర్ వెర్సస్ మాజీ సీఎం

ఈ ఏడాది ఇండియ‌న్ బాక్సాఫీస్‌లో అతి పెద్ద‌ స‌ర్ప్రైజ్ హిట్ అంటే.. ది క‌శ్మీర్ ఫైల్స్ చిత్ర‌మే. 80, 90 ద‌శ‌కాల్లో క‌శ్మీర్లో హిందూ పండిట్ల మీద ఇస్లాం ఛాంద‌స‌వాదులు జ‌రిపిన హ‌త్యాకాండ నేప‌థ్యంలో బాలీవుడ్ ద‌ర్శ‌కుడు వివేక్ రంజ‌న్ అగ్నిహోత్రి రూపొందించిన ఈ చిత్రం పెద్ద‌గా అంచ‌నాల్లేకుండా విడుద‌లై భారీ విజ‌యాన్నందుకుంది.

ఐతే బాక్సాఫీస్ స‌క్సెస్ ప‌క్క‌న పెడితే.. ఈ సినిమాలో చూపించిన విష‌యాల‌పై మిశ్ర‌మ స్పంద‌న వ్య‌క్త‌మైంది. చ‌రిత్రకెక్క‌ని దారుణాల‌ను, పాల‌కుల త‌ప్పుల‌ను చాలా బాగా చూపించారంటూ ఓ వ‌ర్గం ప్ర‌శంస‌లు కురిపిస్తే.. ఇలాంటి సినిమాలు ప్ర‌శాంతంగా బ‌తుకుతున్న ప్ర‌జ‌ల మ‌ధ్య‌ విద్వేషాల‌కు కార‌ణ‌మ‌వుతాయ‌ని మ‌రో వర్గం విమ‌ర్శ‌లు గుప్పించింది. కాగా సినిమా రిలీజైన కొన్ని నెల‌ల త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌కు ఈ సినిమాకు ముడిపెడుతూ జ‌మ్ము-క‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఫ‌రూఖ్ అబ్దుల్లా క‌శ్మీర్ ఫైల్స్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఇటీవ‌ల క‌శ్మీర్ లోయ‌లోని బుద్గాం ప్రాంతంలో రాహుల్ భ‌ట్ అనే ప్ర‌భుత్వ ఉద్యోగిని ఉగ్ర‌వాదులు కాల్చి చంపారు. దీనిపై పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు చెల‌రేగాయి. దీనిపై ఫ‌రూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు క‌శ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలే కార‌ణ‌మ‌ని, ఈ సినిమా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేలా ఉంద‌ని, దీనిపై తాను లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌తో మాట్లాడాన‌ని.. ఇలాంటి సినిమాల‌ను ఆపాల‌ని కోరాన‌ని అన్నారు.

ఐతే త‌న సినిమాను త‌ప్పుబ‌ట్ట‌డంపై క‌శ్మీర్ ఫైల్స్ ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహోత్రి వ్యంగ్యంగా స్పందించాడు. స‌రిగ్గా చెప్పారు ఫ‌రూఖ్ సాబ్. క‌శ్మీర్ ఫైల్స్ లేక‌పోతే హిందువుల‌పై హింసాకాండ జ‌రిగేదే కాదు. మా సినిమా ద్వారానే క‌శ్మీర్ ప్ర‌జ‌లు ర‌లివ్, గ‌లివ్, చ‌లివ్ (మారు, వెళ్లిపో, చ‌చ్చిపో) ప‌దాలు నేర్చుకున్నారు. లేదంటే అక్క‌డి అమాయ‌క ప్ర‌జ‌ల‌కు ఏం మాట్లాడాలో కూడా తెలిసేది కాదు. అక్క‌డ పాకిస్థాన్ జెండా కూడా ఎగిరేది కాదు అంటూ సినిమాలో చూపించిన విష‌యాల‌కు ముడిపెడుతూ.. ఫ‌రూఖ్‌కు వివేక్ కౌంట‌ర్ ఇచ్చాడు.

This post was last modified on May 18, 2022 8:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏజెంట్ రెండేళ్లు ఓటీటీలోకి రానిది ఇందుకా?

అఖిల్ కెరీర్‌ను మార్చేస్తుంద‌ని.. అత‌డిని పెద్ద స్టార్‌ను చేస్తుంద‌ని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అత‌నొక్క‌డే,…

2 hours ago

పవర్ స్టార్… ఇప్పుడు అభినవ శ్రీకృష్ణదేవరాయ!

ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…

4 hours ago

మ‌నిషి వైసీపీలో – మ‌న‌సు కూట‌మిలో..!

రాష్ట్రంలోని ఒక్కొక్క‌ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…

5 hours ago

జైల్లో ఉన్న హీరోకు థియేటర్ విడుదల

స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…

5 hours ago

తమ్మినేని తనయుడి పొలిటికల్ పాట్లు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…

6 hours ago

దురంధర్ మీద రాళ్ళూ పూలూ విసురుతున్నారు

మొన్న శుక్రవారం విడుదలైన దురంధర్ కొద్దిరోజుల క్రితం వరకు బజ్ పరంగా వెనుకబడే ఉంది. ట్రైలర్ అంత ఎగ్జైటింగ్ గా…

6 hours ago