మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ టైంలోనే స్టార్డం అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆచార్య’ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. కానీ ఆ వెంటనే వచ్చిన ‘ఆచార్య’ చరణ్ సక్సెస్ కి బ్రేక్ వేసింది. నిజానికి రామ్ చరణ్ కి ఇది కామన్ అయిపోయింది. అవును రెండో సినిమా ‘మగధీర’తో రికార్డులు తిరగరాసి ఇండస్ట్రీ హిట్ కొట్టిన చరణ్ ఆ వెంటనే ‘ఆరెంజ్’ తో డిజాస్టర్ అందుకున్నాడు. ఇక ‘రంగస్థలం’ తర్వాత కూడా ఇదే రిపీట్ అయింది. తన నటనతో, కంటెంట్ మెస్మరైజ్ చేసి నాన్ బాహుబలి రికార్డు కొట్టాడు చెర్రి. కానీ ఆ వెంటనే బోయపాటితో చేసిన ‘వినయ విధేయ రామ’ డిజాస్టర్ కే బాప్ అనిపించుకుంది.
ఇలా రామ్ చరణ్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ప్రతీ సారి ఆ వెంటనే ఓ ఫ్లాప్ వచ్చి కెరీర్ ని డౌన్ చేస్తుంది. నిజానికి ‘ఆచార్య’ ఇంపాక్ట్ చిరుతో పాటు చరణ్ మీద కూడా పడింది. ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ కూడా దాటలేకపోయింది. ఇక శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న సినిమాపై మంచి బజ్ ఉంది. ఇప్పటి వరకు తీసిన షూట్ అవుట్ పుట్ బాగానే వచ్చిందని ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. కానీ ఆ సినిమా తర్వాత గౌతం తిన్ననూరితో సినిమా చేయనున్నాడు చరణ్. అంటే RC15 బిగ్గెస్ట్ హిట్టయితే ఆ బ్యాడ్ సెంటిమెంట్ గౌతం సినిమా మీద పడనుందన్నమాట.
కొన్ని సార్లు బ్యాడ్ సెంటిమెంట్ లని నమ్మలేం అంటూ కొట్టి పారేస్తాం కానీ అవి జరిగిపోతాయంతే. ఉదాహరణకి రాజమౌళి సినిమా తర్వాత ప్రతీ హీరో ఓ డిజాస్టర్ చవి చూస్తాడు. రామ్ చరణ్ కి కూడా అదే జరిగింది. మరి ఈ బ్యాడ్ సెంటిమెంట్ దృష్టిలో పెట్టుకొని రామ్ చరణ్ బిగ్గెస్ట్ హిట్ తర్వాత కచ్చితంగా జాగ్రత్త పడాలి. అదిరిపోయే ప్లానింగ్ తో సినిమా చేసుకోవాలి. లేదంటే ఇలా ఫ్లాప్స్ లు వస్తూనే ఉంటాయేమో.
This post was last modified on May 17, 2022 11:16 pm
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…