ఇంకో పదే రోజుల్లో ఎఫ్3 థియేటర్లలో అడుగు పెట్టనుంది. అప్పటికి సర్కారు వారి పాట రెండు వారాలు పూర్తి చేసుకుని ఉంటుంది కాబట్టి టెన్షన్ పడటానికి ఏమి లేదు. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 తరహాలో వారాల తరబడి ఇంపాక్ట్ ఉండే అవకాశం లేదని తేలిపోయింది. సో ఫ్యామిలీ ఆడియన్స్ కి బెస్ట్ ఛాయస్ గా ఎఫ్3 నే నిలుస్తుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రమోషన్లలో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఎడతెరిపి లేకుండా ఇంటర్వ్యూలు, టీవీ షోలు, ఛానల్స్ కు వెళ్లే కార్యక్రమాలు నాన్ స్టాప్ గా ప్లాన్ చేసుకుంది దిల్ రాజు టీమ్.
ఇక అనుమతులు వస్తున్నాయి కదాని టికెట్ రేట్లు ఇష్టారీతిన పెంచుకోవడం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో గమనిస్తున్న దిల్ రాజు దీనికి మాత్రం అలాంటి రిస్క్ చేయరట. తెలంగాణలో సింగల్ స్క్రీన్ గరిష్టంగా 150, మల్టీ ప్లెక్సులో మాగ్జిమమ్ 250 రూపాయల లోపే ఉండేలా ధరలు నిర్ణయిస్తారట. ఇదే నిజమైతే జిఓలతో పని లేదు. రెండు మూడు రోజుల్లో ఆన్ లైన్ బుకింగ్స్ మొదలుపెట్టేసుకోవచ్చు. ఏపిలోనూ పెంపుతో పనుండకపోవచ్చు. అదేమీ లేకుండానే భీమ్లా నాయక్ యావరేజ్ టాక్ తోనే మంచి వసూళ్లు తెచ్చుకుంది.
ఇప్పుడీ ఎఫ్3కి బాగానే ఉందనే టాక్ వచ్చినా చాలు దూసుకుపోవచ్చు. కాకపోతే చాలా తక్కువ గ్యాప్ లో జూన్ 3న విక్రమ్, పృథ్విరాజ్, మేజర్ లు వస్తున్నాయి. వాటికి ధీటుగా నిలవాలంటే కుటుంబ ప్రేక్షకుల మద్దతు చాలా అవసరం. జానర్ పరంగా పోల్చుకుంటే ఆ మూడింటికన్నా ఎఫ్3కే క్లాస్ ఆడియన్స్ లో కాస్త ఎక్కువ ఎడ్జ్ వస్తుంది. అనిల్ రావిపూడి ఎంటర్ టైన్మెంట్ ని ఎలా డీల్ చేశాడో చూడాలి. ఇవాళ రిలీజైన పూజా హెగ్డే ఐటెం సాంగ్ సోషల్ మీడియాలో బాగానే వెళ్తోంది. చూడాలి మరి వెంకీ వరుణ్ లు ఏం చేస్తారో
This post was last modified on May 17, 2022 11:04 pm
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…
మొన్న శుక్రవారం విడుదలైన దురంధర్ కొద్దిరోజుల క్రితం వరకు బజ్ పరంగా వెనుకబడే ఉంది. ట్రైలర్ అంత ఎగ్జైటింగ్ గా…