‘ఆచార్య’ తో ఫర్ ది ఫస్ట్ టైం డిజాస్టర్ చవి చూశాడు కొరటాల. ఆ సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ మీడియా ముందుకు రాలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో తను తీయబోతున్న సినిమాకు సంబంధించి వర్క్ చేస్తున్నాడు. మరో మూడు రోజుల్లో మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు రాబోతుంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి అప్ డేట్ ఉంటుందని హింట్ ఇచ్చాడు కొరటాల. ప్రస్తుతం దాని మీదే వర్క్ చేస్తున్నాడు. తారక్ బర్త్ డే రోజు NTR30 లుక్ పోస్టర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు కొరటాల. ప్రెజెంట్ ఓ లుక్ తో పోస్టర్ డిజైనింగ్ చేయిస్తున్నాడట. ఇటివలే తారక్ లుక్ టెస్ట్ చేసి లాక్ చేసుకున్నారు. అందులో నుండి ఓ స్టిల్ పోస్టర్ తో రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది.
ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ లో ఎన్టీఆర్ లుక్ కి ఫిదా అయ్యారు ఫ్యాన్స్. చెక్ షర్ట్స్ వేసుకొని బియర్డ్ స్టైలిష్ లుక్ లో కనిపించాడు ఎన్టీఆర్. ఇప్పుడు ఈ కాంబోలో రాబోయే సినిమాలో తారక్ లుక్ ఎలా ఉంటుందా అంటూ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కొరటాల కూడా దీని కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్తున్నాడట. ఎన్టీఆర్ ని ఇంకా స్టైలిష్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడట.
అయితే కొరటాల ఎన్టీఆర్ ని ఎలా ప్రెజెంట్ చేస్తున్నాడు ? తారక్ లుక్ ఎలా ఉండబోతుంది ? వీటన్నిటికి మూడు రోజుల్లో క్లారిటీ రానుంది. మిక్కిలినేని సుధాకర్ నిర్మించనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రష్మిక హీరోయిన్ గా నటించనుందని సమాచారం. విలన్ ఇంకా ఫైనల్ అవ్వలేదు. అనిరుద్ మ్యూజిక్ ఇచ్చే అవకాశం ఉంది.
This post was last modified on May 17, 2022 4:52 pm
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…