ఒకప్పుడు లవ్ స్టోరీస్ తో లవర్ బాయ్ ఇమేజ్ అందుకున్న హీరో రామ్ ఇప్పుడు రూటు మార్చేశాడు. అవును రామ్ సినిమాల లిస్టు చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. పూరి ఏ క్షణాన రామ్ ని ‘ఇస్మార్ట్ శంకర్’ గా మార్చేసి మాస్ ఆడియన్స్ కి దగ్గర చేశాడో అప్పటి నుండి రామ్ మాస్ కమర్షియల్ సినిమాలే ఒప్పుకుంటున్నాడు.
ఇస్మార్ట్ తర్వాత రామ్ రెడ్ అనే సినిమా చేశాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఓ మోస్తరు కలెక్షన్స్ రాబట్టింది. ఆ వెంటనే కోలీవుడ్ మాస్ డైరెక్టర్ లింగుస్వామితో ‘ది వారియర్’ సినిమా లాక్ చేసుకొని సెట్స్ పై పెట్టేశాడు. ప్రస్తుతం షూటింగ్ స్టేజిలో ఉన్న ఈ సినిమా టీజర్ చూస్తే రామ్ మాస్ హీరోగా నిలబడటానికి ఎంత కష్టపడుతున్నాడో తెలుస్తుంది. టీజర్ అంతా మాస్ యాక్షన్స్ తో నింపేసి సినిమాలో కంటెంట్ ఎలా ఉండబోతుందో చూపించారు.
ఇక నెక్స్ట్ బోయపాటి శ్రీను తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు రామ్. బోయపాటితో సినిమా అంటే ఏ రేంజ్ లో యాక్షన్ ఉంటుందో ఊహించుకోవచ్చు. రామ్ కోసం అలాంటి మాస్ కంటెంట్ నే తీసుకొని స్క్రిప్ట్ లాక్ చేసుకున్నాడు బోయపాటి. ఈ సినిమాతో మాస్ హీరోగా రామ్ మరో మెట్టు ఎక్కబోతున్నాడని యూనిట్ అంటోంది. పవర్ పాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాతో కంప్లీట్ యాక్షన్ హీరోగా మరిపోనున్నాడు రామ్.
ఇకపై రామ్ తో సినిమా చేయాలని ఏ దర్శకుడైనా అనుకుంటే మాస్ కథతోనే అప్రోచ్ అవ్వాల్సి ఉంది. ఇప్పుడప్పుడే లవ్ స్టోరీస్ చేసే ఆలోచనలో లేడు రామ్ పోతినేని. వరుసపెట్టి మాస్ దర్శకులతో యాక్షన్ సినిమాలు ప్లాన్ చేసుకుంటూ టాప్ ప్లేస్ కి వెళ్ళాలని భావిస్తున్నాడు. మరి రామ్ ఎంచుకున్న ఈ రూటు అతన్ని ఏ ప్లేస్ కి తీసుకెళ్తుందో చూడాలి.
This post was last modified on May 17, 2022 4:44 pm
ఒకపక్క రజనీకాంత్ జైలర్ 2, ఇంకోవైపు ప్యాన్ ఇండియా మూవీ రణబాలి. రెండూ మంచి బజ్ తెచ్చుకున్నాయి. బడ్జెట్, బిజినెస్…
ఆయన ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు. ఒక రాష్ట్రానికి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు. ప్రజలకు స్ఫూర్తిగా నిలబడాల్సిన లీడర్.…
దసరా సెలవులు ముగింపుకి వస్తున్న తరుణంలో ఒక విషయం బాగా అర్థమయ్యింది. సంక్రాంతి లాగా మరో కీలకమైన సీజన్ గా…
దసరా అంటే సంక్రాంతి తర్వాత బాక్సాఫీస్ కు అతి పెద్ద పండగ. పది రోజుల దాకా సెలవులు ఉంటాయి కాబట్టి…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ‘జైలర్-2’కు విడుదల ముంగిట పెద్దగా హైప్ ఏమీ కనిపించలేదు. ఆ సినిమా ప్రోమోలు…
రప్పా రప్పా రాజకీయాలు మనకు వద్దని, రాష్ట్రాన్ని భయం నీడలో బతికే పరిస్థితికి తిరిగి తీసుకురావొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు…