Movie News

మెగా టైటిల్స్ ఎగిరిపోతున్నాయి

నిన్న విడుదల చేసిన విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమా ఫస్ట్ లుక్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఎంత అసంతృప్తిని రగిల్చిందో సోషల్ మీడియా వేదికగా చూస్తున్నాం. అలాంటి క్లాసిక్ టైటిల్స్ ని టచ్ చేయకూడదని అభిమానులు ట్వీట్లు పెడుతుండగా దానికి తగ్గట్టు రౌడీ బాయ్ ఫ్యాన్స్ కూడా కౌంటర్లు ఇస్తున్నారు. అయితే మెగా బ్రదర్స్ టైటిల్స్ తీసేసుకోవడం కొత్తేమీ కాదు. ఆ మాటకొస్తే కార్తీ డబ్బింగ్ సినిమాలకు దొంగ, ఖైదీ రెండూ వాడేశారు. ఇవి అప్పట్లో ఎంత పెద్ద హిట్లో అభిమానులకు ఎంత ఎమోషనల్ కనెక్షన్ ఉందో తెలిసిందే.

ఆ మధ్య నాని ‘గ్యాంగ్ లీడర్’ అన్నప్పుడు పెద్ద రభస జరిగింది. పెట్టుకోవద్దని చిరు ఫ్యాన్స్ ఎంత డిమాండ్ చేసినా వినలేదు. అఫ్కోర్స్ సినిమా ఫలితం తేడా కొట్టడంతో అందరూ మర్చిపోయారు. వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ను తీసుకున్నప్పుడు ఫిర్యాదు రాలేదు. అదే కంపౌండ్ హీరో కాబట్టి అంతగా ఒత్తిడి చేయలేదు. రజనీకాంత్ పెద్దన్నకు ముందు అనుకున్న టైటిల్ అన్నయ్య. అనవసరంగా లేనిపోని పోలిక వస్తుందని డ్రాప్ అయ్యారు. ‘విజేత’ను స్వయానా ఆయన చిన్నల్లుడు కళ్యాణ్ దేవే ఫ్లాప్ తో చెడగొట్టాడు.

గతంలో ఇలాగే ‘స్టేట్ రౌడీ’ని శివాజీ, ‘యముడికి మొగుడు’ని అల్లరి నరేష్ పాడుచేశారు. ‘రాక్షసుడు’ని బెల్లంకొండ సాయిశ్రీనివాస్ వాడుకుని హిట్టు కొట్టాడు. ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ఇది తప్పేం కాదు కానీ ఇప్పటికైనా పాత టైటిల్స్ ని రెన్యూవల్ చేస్తూ వాటిని దుర్వినియోగం కాకుండా చూడమని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, దొంగమొగుడు, ముఠామేస్త్రి, హిట్లర్ లాంటివి కొణిదెల బ్యానర్ మీద రిజిస్టర్ చేయమంటున్నారు. కానీ ఇదంతా జరిగే పనేనా అంటే డౌటే

This post was last modified on May 17, 2022 2:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌నిషే పోయాక ఐకాన్ స్టారైతే ఏంటి సూప‌ర్ స్టారైతే ఏంటి? : మంత్రి

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న గొడ‌వంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్…

36 minutes ago

ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి ప‌రిస్తితి ఎదుర‌వుతోందో తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి…

36 minutes ago

బన్నీ ఉదంతం – ఆనందాన్ని కమ్మేసిన ఆందోళన!

సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…

1 hour ago

నా సినిమా లేకపోయి ఉంటే OG ని తీసుకొచ్చేవాడిని : చరణ్

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…

2 hours ago

ఢిల్లీకి చేరిన ‘తెలుగు వారి ఆత్మ‌గౌరవం’

తెలుగు వారి ఆత్మ గౌర‌వ నినాదంతో ఏర్ప‌డిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు స‌హా త‌మిళ‌నాడు క‌ర్ణాట‌క‌లోని…

3 hours ago

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

4 hours ago