రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న RC15 కి సంబంధించి ఇంకా రిలీజ్ డేట్ లాక్ అవ్వలేదు. ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి ఎనౌన్స్ చేయాలని నిర్మాత దిల్ రాజు భావించారు. కానీ శంకర్ మేకింగ్ స్టైల్, వర్కింగ్ డేస్ ని దృష్టిలో పెట్టుకొని లాంచింగ్ కి డేట్ ఎనౌన్స్ చేయలేదు. అక్టోబర్ , నవంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతి బరిలో దింపాలని అనుకున్నారు. ఆల్మోస్ట్ సంక్రాంతి రిలీజ్ అన్నట్టుగానే వర్క్ చేస్తున్నారు కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ ప్లాన్ మారిందని తెలుస్తుంది.
దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న విజయ్ – వంశీ పైడిపల్లి కాంబినేషన్ సినిమాను సంక్రాంతి రిలీజ్ అంటూ ఎనౌన్స్ చేశారు. తమిళ్ నాడు , ఆంధ్రా లో ఫెస్టివల్ మోడ్ ని దృష్టిలో పెట్టుకొని భారీ రిలీజ్ ప్లాన్ చేసుకున్నాడు దిల్ రాజు. నిజానికి సంక్రాంతి స్లాట్ ను ముందుగా చరణ్ సినిమాకే కేటాయించుకున్నాడు దిల్ రాజు. ఇంకా షూట్ చాలా పెండింగ్ ఉండటంతో సంక్రాంతి రిలీజ్ ప్లాన్ మార్చుకొని ఇప్పుడు సమ్మర్ కి షిఫ్ట్ చేయాలని చూస్తున్నారట.
వచ్చే ఏడాది సమ్మర్ లో మార్చ్ లేదా ఏప్రిల్ లో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. మార్చ్ 24 లేదా ఏప్రిల్ 7 ఇలా రెండు డేట్స్ ఫైనల్ లిస్టులో ఉన్నాయి. ఇందులో ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక రామ్ చరణ్ ‘రంగస్థలం’ కూడా మార్చ్ లోనే రిలీజైంది. ఆ ఏడాది సమ్మర్ లో బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది. ఆ సెంటిమెంట్ ప్రకారం మార్చ్ లోనే ఈ క్రేజీ మూవీని థియేటర్స్ లోకి దింపే అవకాశం ఉంది. త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది. ఇటివలే వైజాగ్ లో షూటింగ్ పూర్తి చేసిన టీం ప్రస్తుతం బ్రేక్ తీసుకుంటున్నారు. త్వరలోనే మారేడుమిల్లి లేదా హైదరాబాద్ లో షెడ్యుల్ మొదలయ్యే అవకాశం ఉంది.
This post was last modified on May 16, 2022 9:25 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…