సూపర్ స్టార్ మహేష్ కి స్టార్ హీరోగా భారీ క్రేజ్ ఉంది. కేవలం సినిమాలతోనే కాదు చిన్నారులకు మెరుగైన చికిత్స అందించే తన మంచిమనస్సుతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు మహేష్. అందుకే సూపర్ స్టార్ సినిమా అంటే ఫ్యామిలీలు థియేటర్స్ కి క్యూ కడతారు.
‘సర్కారు వారి పాట’ విషయంలోనూ అదే జరిగింది. మొదటి రోజు మిక్స్డ్ టాక్ తో ఓ మోస్తరు వసూళ్ళు వచ్చాయి. కానీ రెండో రోజు నుండి ఫ్యామిలీ ఆడియన్స్ భారీ కలెక్షన్స్ అందించారు. దీంతో సినిమా రెవెన్యూ పరంగా బాగా పికప్ అయింది. ఏకంగా కుటుంబమంతా బస్ లో వచ్చి మహేష్ సినిమా చూసి వెళ్ళారంటే ఫ్యామిలీస్ లో మహేష్ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
‘సర్కారు వారి పాట’ సంబంధించి నెగిటివ్ టాక్ తోనే వంద కోట్లు కొల్లగొట్టాడు మహేష్. కంటెంట్ వీక్ అనే కంప్లైంట్ ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో సినిమా భారీ కలెక్షన్స్ రాబడుతుంది. ఇది మహేష్ కి కొత్త కాదు. ఈ మధ్య మహేష్ సినిమాలన్నీ కంటెంట్ పరంగా మెస్మరైజ్ చేసి యూనానిమస్ టాక్ అందుకోలేకపోతున్నాయి . ‘భరత్ అనే నేను’, మహర్షి’,’సరిలేరు నీకెవ్వరు’ సినిమాలేవీ ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో మెప్పించలేదు. ఈ సినిమాలన్నిటిలోనూ సెకండాఫ్ వీక్ అనే కంప్లైంట్ ఉంది.
నిజానికి మహేష్ క్రేజ్ కి దమ్మున్న కథ పడితే, ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసే సినిమా వస్తే ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ‘ఒక్కడు’, ‘పోకిరి’,’దూకుడు’ సినిమాలే దీనికి ఉదాహరణ. ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ లో మెజారిటీ జనాలకు ‘సర్కారు వారి పాట’ ఫుల్ మీల్స్ పెట్టలేకపోయింది.
మహేష్ వన్ మెన్ షో మీదే సినిమా నడిచి వసూళ్ళు అందిస్తుంది. మరి ఇలాంటి టైంలో మహేష్ అదిరిపోయే కంటెంట్ తో వస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. మహేష్ నెక్స్ట్ త్రివిక్రమ్ తో ఓ సినిమా , రాజమౌళితో మరో సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాల్లో ఏమాత్రం దమ్మున కథ పడినా మహేష్ రికార్డుల దుమ్ము దులిపెస్తాడు.
This post was last modified on May 16, 2022 9:19 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…