ఎల్లకాలం హీరోలుగా కొనసాగడం అందరికీ సాధ్యం కాదు. ఒక స్థాయికి మించి స్టార్ ఇమేజ్ సాధించలేకపోయినా, వయసు మళ్లాక హీరోలుగా చేసిన సినిమాలు వరుసగా పరాజయం పాలైనా.. క్యారెక్టర్, విలన్ రోల్స్‌లోకి మారక తప్పదు. నరేష్, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్.. ఇలా చాలామంది సీనియర్ హీరోలు ఇలా కెరీర్‌ను మార్చుకున్న వాళ్లే. కానీ ఆ తరం స్టార్ హీరోల్లో ఒకడైన రాజశేఖర్ మాత్రం ఇంకా అటు వైపు అడుగులు వేయట్లేదు. హీరో వేషాలు వదలట్లేదు. గత దశాబ్దన్నర కాలంలో రాజశేఖర్ కొట్టిన ఏకైక హిట్టు ‘గరుడవేగ’ మాత్రమే. నిజానికి బాక్సాఫీస్ లెక్కల్లో చూస్తే అది కూడా ఫ్లాపే. బడ్జెట్ ఎక్కువ కావడం వల్ల అది కాస్ట్ ఫెయిల్యూర్ అయింది.
ఈ నేపథ్యంలో రాజశేఖర్ క్యారెక్టర్, విలన్ రోల్స్‌లోకి మారితే బాగుంటుందని, అవి రాజశేఖర్‌కు ఉపయోగపడటంతో పాటు ఆ పాత్రలకూ విలువ చేకూరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ రాజశేఖర్ మాత్రం రూటు మార్చట్లేదు.
క్యారెక్టర్, విలన్ రోల్స్ గురించి ఎప్పుడు అడిగినా.. ఆయన చెబుతున్న సమాధానం ‘తనీ ఒరువన్’లో విలన్ తరహా పాత్ర వస్తే చేసేవాడినని. తన కొత్త సినిమా ఏది రిలీజైనా ప్రమోషన్లలో ఆయన అదే చెబుతున్నాడు. గతంలో రెండుమూడుసార్లు ఈ మాట అన్నాడు. ఇప్పుడు ‘శేఖర్’ రిలీజ్ ముంగిట కూడా ఓ ఇంటర్వ్యూలో ఇదే పునరావృతం అయింది. ‘తనీ ఒరువన్’ తెలుగు వెర్షన్ ‘ధృవ’లో అరవింద్ స్వామి పాత్ర చేయమని తనను అడిగితే కచ్చితంగా చేసేవాడినని రాజశేఖర్ తెలిపాడు. అలాంటి పాత్రలతో తనను రచయితలు, దర్శకులు సంప్రదిస్తే ఓకే అంటానని.. కానీ తనను ఎగ్జైట్ చేసే పాత్రలు ఎవరూ ఇవ్వట్లేదని ఆయనన్నాడు. తన నుంచి అభిమానులు కూడా ఇలాంటి పాత్రలే కోరుకుంటారని ఆయన చెప్పాడు.
ఐతే ‘తనీ ఒరువన్’ విలన్ పాత్రను మైండ్‌లో పెట్టేసుకుని.. ప్రతి పాత్రనూ దాంతో పోల్చి చూసుకుంటే చాలా కష్టం. అలాంటి అసాధారణ పాత్రలు రాయడం, వాటిని తెరమీద ప్రెజెంట్ చేయడం అంత సులువు కాదు. అలాంటివి అరుదుగానే పడతాయి. ముందు క్యారెక్టర్ లేదా విలన్ క్యారెక్టర్లు చేయడం మొదలుపెడితే.. తర్వాత రచయితలు, దర్శకులు ఇన్‌స్పైర్ అయి ఇంకా మంచి పాత్రలు తీర్చిదిద్దొచ్చు. అరవింద్ స్వామికైనా నేరుగా ఆ పాత్ర పడిపోలేదు. దాని కంటే ముందు వేరే క్యారెక్టర్ రోల్స్ చేశాడు. కాబట్టి రాజశేఖర్ ‘తనీ ఒరువన్’తో పోలికలు పక్కన పెట్టేసి రంగంలోకి దిగడం మంచిది.
This post was last modified on May 16, 2022 4:44 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…