అదేంటి ఎలాంటి ప్రకటన, హడావిడి లేకుండా కెజిఎఫ్ 2 ప్రైమ్ లో రావడం ఏమిటనుకుంటున్నారా. ఇది అక్షరాలా నిజం. ఇందాకే కొద్దినిమిషాల క్రితం అమెజాన్ ప్రైమ్ లో తెలుగుతో సహా కన్నడ హిందీ మలయాళం తమిళంలో స్ట్రీమింగ్ మొదలైపోయింది. కానీ అకౌంట్ ఉన్న వాళ్లకు ఫ్రీగా కాదు లెండి. 199 రూపాయలు అద్దె చెల్లించి మనకు అనుకూలమైన సమయంలో మొదలుపెట్టాక 48 గంటలలోపు షోని పూర్తిగా చూసేయాలి. ఒకవేళ అప్పటికి పూర్తి కాకపోతే మళ్ళీ ఫ్రెష్ గా కొనడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు.
నిజానికి ప్రైమ్ చెప్పా పెట్టకుండా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఎప్పుడూ రిలీజ్ చేయలేదు. ఈ నెల 20న ఆర్ఆర్ఆర్ ఇదే మోడల్ లో జీ5 ద్వారా విడుదల కానున్న సంగతి తెలిసిందే. దానికి నాలుగు రోజుల ముందే కెజిఎఫ్ 2 ఇలా వచ్చేయడం ఊహించని ట్విస్ట్. నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలిమ్స్ వీడియో ఆన్ డిమాండ్ కింద ఇంట్లోనే చూడొచ్చని ఇందాకే ట్వీట్ చేసింది. యుట్యూబ్ లో దీనికి సంబంధించిన కొత్త ట్రైలర్లు ప్రైమ్ ఇండియా ఛానల్ లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు
సో రాబోయే రోజుల్లో ఫలానా యాప్ లో అకౌంట్ ఉంది కదా ఏడాది చందా కట్టామని అందులో కంటెంట్ మొత్తం ఫ్రీగా చూడొచ్చనుకుంటే పొరపాటే అవుతుంది. విదేశాల మాదిరి ఇక్కడ కూడా పే పర్ వ్యూని విస్తృతం చేసే పనిలో పడ్డాయి డిజిటల్ సంస్థలు. అందులో భాగంగా ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లను దీనికి తొలి అడుగుగా ఎంచుకున్నాయి. ఇది ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో పైరసీ తాకిడిని తట్టుకుని ఎలా నిలబడుతుందో వేచి చూడాలి. ప్రైమ్ సబ్స్క్రైబర్స్ కి ఫ్రీ స్ట్రీమింగ్ ఇంకో రెండు వారాల్లోపే ఉండొచ్చు
This post was last modified on May 16, 2022 4:42 pm
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…