పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన క్లాసిక్ లవ్ స్టోరీ ‘ఖుషి’. ఇన్నేళ్ళయినా ఆడియన్స్ ఈ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీని మర్చిపోలేదు. ఇప్పటికీ టివీలో మంచి రేటింగ్ అందుకుంటుంది. ఈ క్లాసిక్ టైటిల్ ని ఇప్పుడు విజయ్, సమంత నటిస్తున్న సినిమాకు పెట్టుకున్నారు. ఇద్దరూ మంచులో కూర్చున్న స్టిల్ తో ఖుషి టైటిల్ తో ఫస్ట్ లుక్ వదిలారు. టైటిల్ సాఫ్ట్ గా డిజైన్ చేయించి ప్లీసెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఈ టైటిల్ పెట్టుకోవడం ఎంత ప్లస్సో అంతే మైనస్ కూడా.
క్లాసిక్స్ టైటిల్ పెట్టుకునే ముందే మేకర్స్ ఆలోచించాల్సి వస్తుంది. అందులోకి ఇది పవన్ టైటిల్. ఫ్యాన్స్ టైటిల్ చూసి అంచనాలు పెట్టుకుంటారు. ఆ ఎక్స్ పెక్టేషన్స్ తోనే థియేటర్స్ కి వస్తారు. ఆ సినిమాతో పోలుస్తూ కామెంట్స్ కూడా చేస్తారు. మరి శివ నిర్వాణ ఇవన్నీ ఆలోచించే ఈ టైటిల్ పెట్టుకున్నడా లేదా టైటిల్ తో హైప్ క్రియేట్ చేసి మూవీ లవర్స్ మాట్లాడుకోవాలనుకోవాలని అనుకున్నాడా తనకే తెలియాలి. ఓపెనింగ్ రోజే ఈ లవ్ స్టోరీకి కొంత బజ్ వచ్చింది. విజయ్ -సమంత ఫుల్లెంత్ లవ్ స్టోరీ చేస్తుండటం, పైగా కాశ్మీర్ నేపథ్యం అనేసరికి అంచనాలు పెరిగాయి.
ఇప్పుడు పవన్ టైటిల్ కూడా ఎడ్వాంటేజ్ అయింది. ఇవన్నీ కలిసి సినిమాకు పాజిటివ్ బజ్ తీసుకొచ్చాయి. కానీ శివ నిర్వాణ ఇటివలే ‘టక్ జగదీశ్’ తో మొదటి సారి డిజాస్టర్ డెలివరీ చేశాడు. ఇక విజయ్ కూడా ఆ మధ్య కొన్ని లవ్ స్టోరీస్ తో ప్రేక్షకులను బాగా నిరాశ పరిచాడు. మరి ఫ్లాప్ డైరెక్టర్ , ఫెయిల్యూర్ హీరో పవన్ టైటిల్ తో ఎలాంటి హిట్ కొడతారో వేచి చూడాలి.
This post was last modified on May 16, 2022 2:08 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…