Movie News

ఈ టాక్‌తోనూ మహేష్ బానే లాగుతున్నాడు

తెలుగు ప్రేక్షకులందు యుఎస్ ఎన్నారై ప్రేక్షకులు వేరు. వాళ్లు ఆదరించే సినిమాల లెక్క వేరుగా ఉంటుంది. క్లాస్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ల పట్ల అక్కడి ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తుంటారు. అప్పుడప్పుడు థ్రిల్లర్లకు కూడా మంచి ఆదరణ దక్కుతుంటుంది. అన్నింట్లోనూ వాళ్లు కోరుకునేది క్లాస్ టచ్. ఓవరాల్‌గా హైయెస్ట్ గ్రాసర్ల లిస్టు తీస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఊర మాస్ చిత్రాలకు అక్కడ ఆదరణ తక్కువే. బాహుబలి తరహా ప్రత్యేక చిత్రాల సంగతి వేరు. కానీ యుఎస్‌లో ఓవరాల్‌గా క్లాస్ టచ్ ఉన్న సినిమాలకే ఎక్కువ వసూళ్లు వస్తుంటాయి.

మాస్ మసాలా, రొటీన్ యాక్షన్ చిత్రాలకు అక్కడి ప్రేక్షకుల నుంచి తిరస్కారం ఎదురవుతుంటుంది. కానీ ఈ లెక్కలు మహేష్ చిత్రాలకు వర్తించవనే చెప్పాలి. అతడికి ముందు నుంచి యుఎస్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉంది. ‘దూకుడు’ చిత్రంతో తెలుగు సినిమాకు మిలియన్ డాలర్ క్లబ్బును పరిచయం చేసిందే మహేష్.

అప్పట్నుంచి మహేష్ చిత్రాల్లో ఒకటీ అరా తప్పిస్తే.. అన్నీ అలవోకగా మిలియన్ డాలర్ మార్కును అందుకున్నవే. ఇప్పటికే అతడి సినిమాలు 10 ఈ క్లబ్బులో అడుగు పెట్టడం విశేషం. టాలీవుడ్లో మరే హీరోకూ యుఎస్‌లో ఇన్ని మిలియన్ డాలర్ సినిమాలు లేవు. ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ కూడా ఆ లాంఛనాన్ని పూర్తి చేసింది. ప్రిమియర్లు, తొలి రోజు వసూళ్లతోనే ఆ చిత్రం మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. శనివారం షోలు పూర్తి కాకముందే ‘సర్కారు వారి పాట’ 1.5 మిలియన్ మార్కును కూడా అందుకుంది.

ఈ సినిమాకు వచ్చిన టాక్ ప్రకారం, సినిమా కంటెంట్‌ను బట్టి చూస్తే అప్పుడే 1.5 మిలియన్ మార్కును దాటేయడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ ఊపు చూస్తుంటే వీకెండ్ అయ్యేసరికి మహేష్ మూవీ 2 మిలియన్ మార్కును కూడా అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 2.4 మిలియన్ డాలర్లు రాబట్టాలి. వచ్చే వారం పెద్ద సినిమాలేవీ లేవు కాబట్టి.. ఈ చిత్రం కాస్త కష్టంగా అయినా సేఫ్ జోన్లోకి వెళ్లే అవకాశాలున్నాయి.

This post was last modified on May 15, 2022 4:41 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు…

1 hour ago

‘పార్టీ మారినోళ్లు రెండూ కానోల్లా?’

తెలంగాణ‌లో తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంద‌ని.. ఇది 2029 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని.. అప్పుడు…

3 hours ago

కూటమి కట్టక తప్పదేమో జగన్

వ్య‌క్తిగ‌త విష‌యాలే..  జ‌గ‌న్‌కు మైన‌స్ అవుతున్నాయా? ఆయ‌న ఆలోచ‌నా ధోర‌ణి మార‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వా? అంటే.. అవున‌నే సంకేతాలు పార్టీ…

5 hours ago

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

8 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

9 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

10 hours ago