Movie News

మాస్ రాజాతో తమిళ దర్శకుడు?

హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసబెట్టి సినిమాలు చేసుకుపోతుంటాడు మాస్ రాజా రవితేజ. వరుస ఫ్లాపులు వచ్చినపుడు కూడా అతను జోరు తగ్గించింది లేదు. ఇక ‘క్రాక్’తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాక మాస్ రాజా తగ్గుతాడా? ఆ సినిమా తర్వాత మరింత దూకుడు మీదున్నాడు.

ఆల్రెడీ ‘ఖిలాడి’తో పలకరించిన అతను.. త్వరలోనే ‘రామారావు’ సినిమాతో బాక్సాఫీస్ డ్యూటీ ఎక్కనున్నాడు. దీంతో పాటుగా రవితేజ.. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే పాన్ ఇండియా సినిమాకు కూడా మాస్ రాజా శ్రీకారం చుట్టాడు.

మరోవైపు బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న సినిమాలోనూ మాస్ రాజా ప్రత్యేక పాత్ర నటించనున్నట్లు వార్తలు రావడం తెలిసిందే. ఇన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉన్న మాస్ రాజా.. తాజాగా మరో కొత్త చిత్రాన్ని ఓకే చేసినట్లు సమాచారం.

ఈసారి రవితేజ ఓ తమిళ దర్శకుడితో జట్టు కట్టబోతున్నాడట. ఆ దర్శకుడే.. బాలాజీ మోహన్. సిద్దార్థ్ హీరోగా ‘లవ్ ఫెయిల్యూర్’తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలాజీ మోహన్.. ఆ తర్వాత ధనుష్ హీరోగా ‘మారి’, ‘మారి-2’ చిత్రాలు తీశాడు. ఇవి రెండూ బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించాయి. ఇటీవలే బాలాజీ ఓ వెబ్ సిరీస్‌ను మొదలుపెట్టాడు. దీని తర్వాత రవితేజ హీరోగా ఓ సినిమా చేయడానికి అతను ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అతను చెప్పిన కథకు మాస్ రాజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.

‘టైగర్ నాగేశ్వరరావు’తో ఎలాగూ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు మాస్ రాజా. తర్వాత తమిళ దర్శకుడితో సినిమా అంటే అది కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ఉండొచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఐతే పరభాషా దర్శకులు, అక్కడి కథలతో మాస్ రాజాకు చేదు అనుభవాలున్నాయి.

తమిళ హిట్ల ఆధారంగా తెరకెక్కిన ‘నా ఆటోగ్రాఫ్’, ‘శంభో శివ భంభో’ అతడికి నిరాశను మిగిల్చాయి. ఇందులో ‘శంభో శివ శంభో’ను డైరెక్ట్ చేసింది తమిళ దర్శకుడైన సముద్రఖనినే రూపొందించాడు. మరి బాలాజీ మోహన్ మాస్ రాజాకు ఎలాంటి సినిమా ఇస్తాడో చూడాలి.

This post was last modified on May 15, 2022 11:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

5 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

5 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

6 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

6 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

7 hours ago