Movie News

తమిళ స్టార్లు మారరా?

తెలుగు స్టార్లు ఒక్కొక్కరుగా పాన్ ఇండియా స్థాయిలో తమ మార్కెట్‌ను విస్తరిస్తున్నారు. ఇది చూసి తమిళ స్టార్లకు కూడా ఆశ పుడుతోంది. ఒక్కొక్కరుగా బహు భాషా చిత్రాల్లో నటించడం మొదలు పెడుతున్నారు. ముఖ్యంగా అనువాద చిత్రాలతో తప్ప తెలుగులో ఎప్పుడూ సినిమాలు చేయని స్టార్లంతా ఇప్పుడు వరుసగా తెలుగులో డైరెక్ట్ సినిమాలు సెట్ చేస్తుండటం కొత్త పరిణామం.

నిజానికి చాలామంది తమిళ స్టార్లకు ఒకప్పుడు తెలుగులో మంచి మార్కెట్ ఉండేది. కానీ గత కొన్నేళ్లలో ఆ మార్కెట్ అంతా కరిగిపోయింది. తెలుగు స్టార్లతో సమానంగా ఒకప్పుడు ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య లాంటి బిగ్ స్టార్ల సినిమాలకు ఇప్పుడు ఆ స్థాయిలో ఆదరణ ఉండట్లేదు.

ఇలాంటి టైంలో విజయ్, ధనుష్, శివ కార్తికేయన్ లాంటి తమిళ స్టార్లు తెలుగులో డైరెక్ట్ సినిమాలు చేస్తుండటం విశేషం. ఐతే ఇలా నేరుగా తెలుగులోకి అడుగు పెట్టడానికి ముందు ఇక్కడి ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశం వచ్చినపుడు దాన్ని ఎలా వాడుకుంటారన్నది కీలకం.

ఈ మధ్యే విజయ్ సినిమా ‘బీస్ట్’ రిలీజైంది. దానికి ముందు విజయ్ వరుసగా తెలుగులో హిట్లు కొట్టాడు. ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ‘బీస్ట్’కు మంచి బజ్ కనిపించింది. త్వరలోనే నేరుగా తెలుగు సినిమాతో వస్తున్నపుడు తెలుగు రాష్ట్రాలకు వచ్చి ‘బీస్ట్’ ప్రమోషన్లలో పాల్గొని ఉంటే బాగుండేది. కానీ విజయ్‌ అందుకు ఆసక్తి చూపించలేదు. ఈ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.

తెలుగు ప్రేక్షకులంటే అంత చిన్నచూపా అన్న కామెంట్లు వినిపించాయి. ఇప్పుడు శివ కార్తికేయన్ సైతం ఇదే చేస్తున్నాడు. అతడి చివరి సినిమా ‘వరుణ్ డాక్టర్’ తెలుగులో సర్ప్రైజ్ హిట్టయింది. శివకు ఇక్కడ ఓ మోస్తరుగా గుర్తింపు లభించింది. దీంతో అతడి కొత్త చిత్రం ‘డాన్’ను తెలుగులో రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

కానీ శుక్రవారం సినిమా తెలుగులో రిలీజైన విషయం కూడా జనాలకు తెలియని పరిస్థితి. ఈ సినిమాకు అసలు ప్రమోషన్లవే లేవు. కనీసం పీఆర్వోను కూడా పెట్టుకోలేదు. శివ సహా ఎవ్వరూ ఇటు వైపు చూడలేదు. నిజానికి ఈ చిత్రానికి తమిళంలో మంచి టాక్ వచ్చింది. అక్కడ సినిమా హిట్టే. మరి మంచి సినిమా చేసినపుడు, తర్వాతి చిత్రంతో తెలుగులో అడుగుపెట్టబోతున్న హీరో.. ఇంత నామమాత్రంగా సినిమా రిలీజ్ చేయడం, దాన్ని ప్రమోట్ చేయకపోవడమేంటి?

విజయ్ చేసిన తప్పే శివకార్తికేయన్ కూడా చేయడం చూస్తే ఈ తమిళ స్టార్లు మారరా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ విషయంలో తెలుగులో స్టార్లను కొనియాడాల్సిందే. తెలుగు రాష్ట్రాల అవతల తమ సినిమాలను ఎంత బాగా ప్రమోట్ చేస్తారో చూస్తే.. వాళ్లెందుకు పాన్ ఇండియా స్టార్లుగా ఎదుగుతున్నారో అర్థమవుతుంది.

This post was last modified on May 14, 2022 4:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

11 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

11 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

12 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

13 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

13 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

14 hours ago