ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ జాబితాలో ‘సలార్’ కచ్చితంగా ఉంటుంది. ‘బాహుబలి’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన ప్రభాస్‌తో ‘కేజీఎఫ్’తో ప్రకంపనలు రేపిన ప్రశాంత్ నీల్ సినిమా చేస్తుండటంతో దీనిపై అంచనాలు మామూలుగా లేవు.
ఐతే ఈ చిత్రం ఏడాది కిందటే సెట్స్ మీదికి వెళ్లినా.. షూటింగ్ ఆగి ఆగి సాగుతోంది. ప్రశాంత్.. ‘కేజీఎఫ్-2’తో, ప్రభాస్ ‘రాధేశ్యామ్’తో బిజీగా ఉండటం అందుకు కారణం. ఐతే ఈ రెండు చిత్రాలూ నెల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. హీరో, డైరెక్టర్ ఇద్దరూ కూడా ఇప్పుడు ఫ్రీ అయిపోయారు.
త్వరలోనే కొత్త షెడ్యూల్ మొదలు కాబోతోంది. ఐతే చాన్నాళ్లుగా వార్తల్లో లేని ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి నిర్మాత, హోంబలె ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరగందూర్ ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటిదాకా ‘సలార్’ చిత్రీకరణ 35 శాతం పూర్తయినట్లు అతను వెల్లడించాడు.
ఇక నుంచి షూటింగ్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని, అక్టోబరు-నవంబరు కల్లా షూట్ పూర్తి కావచ్చని విజయ్ తెలిపాడు. వచ్చే వేసవికి ‘సలార్’ ప్రేక్షకుల ముందుకు రావొచ్చని అతను సంకేతాలిచ్చాడు. మరోవైపు ‘కేజీఎఫ్-3’ గురించి కూడా విజయ్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు.
ఈ సినిమాతో మార్వెల్ తరహాలో ఇండియన్ ప్రేక్షకుల కోసం ఒక కొత్త ప్రపంచాన్ని తీర్చిదిద్దాలన్నది తమ ఉద్దేశమని.. కాబట్టి ‘కేజీఎఫ్-3’ కచ్చితంగా ఉంటుందని.. ఈ చిత్రాన్ని2024లో రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నామని.. వచ్చే ఏడాది చిత్రీకరణ మొదలవుతుందని విజయ్ చెప్పాడు.
‘కేజీఎఫ్-2’ రిజల్ట్ తేడా కొట్టి ఉంటే ఏమో కానీ.. ఈ చిత్రం అంచనాలను మించిపోయి వరల్డ్ వైడ్ రూ.1100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన నేపథ్యంలో సీక్వెల్ తీయకుండా ఎలా ఉంటారు? ఇంకో సీక్వెల్ గురించి ‘కేజీఎఫ్-2’ చివర్లో సంకేతాలు ఇవ్వడం తెలిసిందే.
This post was last modified on May 14, 2022 4:34 pm
మలయాళంలో గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై సెన్సేషనల్ హిట్ అయిన సినిమా ‘మార్కో’. జనతా…
సోమవారం వసంత పంచమి. చాలా మంచి రోజు. ఈ శుభ సందర్భాన్ని కొత్త సినిమాల ఓపెనింగ్ కోసం టాలీవుడ్ బాగానే…
విక్టరీ వెంకటేష్ మొట్టమొదటి వెబ్ సిరీస్ గా 2023 మార్చిలో విడుదలైన రానా నాయుడు భారీ స్థాయిలో మిలియన్ల కొద్దీ…
ఊరిపేరు భైరవకోనతో ట్రాక్ లో పడ్డ యూత్ హీరో సందీప్ కిషన్ ఈ నెలలో మజాకాతో పలకరించబోతున్నాడు. త్రినాధరావు నక్కిన…
లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషించిన బ్రహ్మ ఆనందం ఫిబ్రవరి 14 విడుదల కానుంది. మాములుగా అయితే విశ్వక్…
బాలీవుడ్ లో బేబీ జాన్ తో అడుగు పెట్టిన కీర్తి సురేష్ కి తొలి సినిమానే డిజాస్టర్ కావడం నిరాశపరిచేదే…