Movie News

ఖైదీ-2లో సూర్య-కార్తి?

తెలుగు వారికి కూడా బాగా ఇష్టుడైన తమిళ కథానాయకుడు కార్తి కెరీర్లో ‘ఖైదీ’ చాలా స్పెషల్ మూవీ. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మైలురాయిలా నిలిచిన సినిమా టైటిల్ పెట్టుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖైదీ బాక్సాఫీస్ దగ్గర అద్భుత ఫలితాన్నందుకున్నాడు. రిలీజ్ ముంగిట ఈ చిత్రంపై మరీ అంచనాలేమీ లేవు కానీ.. మౌత్ టాక్ చాలా బాగా రావడంతో జనాలు ఎగబడి చూశారీ చిత్రాన్ని. ఇందులో ఓవర్ ద టాప్ హీరోయిజం ఏమీ ఉండదు. చాలా వరకు రియలిస్టిగ్గానే సాగుతుందీ చిత్రం.

ఈ చిత్రంలో హీరోయిన్ కూడా లేకపోయినా సరే.. ఆద్యంతం ఆసక్తికరంగా సాగి ప్రేక్షకులను థ్రిల్ చేసింది. అటు తమిళంలో, ఇటు తెలుగులో ‘ఖైదీ’ పెద్ద హిట్టయింది. ఈ చిత్రాన్ని హిందీలో అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఖైదీ’ రిలీజైనపుడే దీనికి సీక్వెల్ ఉంటుందనే సంకేతాలు వచ్చాయి. హీరో బ్యాక్ స్టోరీని చూపిస్తూ కథను ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఉన్నాడు. ‘ఖైదీ’ టీం అంతా కూడా సీక్వెల్ గురించి ఎప్పటికప్పుడు సంకేతాలు ఇస్తూనే ఉంది.

కాగా అతి త్వరలోనే ‘ఖైదీ-2’ పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం. ‘ఖైదీ’ తర్వాత మాస్టర్, విక్రమ్ లాంటి భారీ చిత్రాలతో లోకేష్ రేంజ్ మారిపోయింది. ఈ నేపథ్యంలో ‘ఖైదీ-2’ను ఆషామాషీగా తీయాలనుకోవట్లేదట అతను. కార్తికి తోడు అతడి అన్నయ్య, టాప్ స్టార్లలో ఒకడైన సూర్యను కూడా ఇందులో నటింపజేయనున్నాడట. సూర్య కోసం అతను ఒక స్పెషల్ క్యారెక్టర్ డిజైన్ చేశాడట.

ప్రాపర్ సీక్వెల్లా కాకుండా ఈ కథను కొత్త మలుపు తిప్పబోతున్నాడని.. చాలా పెద్ద స్థాయిలో సినిమాను రూపొందించబోతున్నారని సమాచారం. ‘ఖైదీ’ని నిర్మించిన సురేశ్ ప్రభునే సీక్వెల్‌ను కూడా నిర్మించబోతున్నాడు. లోకేష్ కొత్త చిత్రం ‘విక్రమ్’ జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. దాని తర్వాతి చిత్రం అతనింకా ప్రకటించలేదు. అది ‘ఖైదీ-2’నే అని. సూర్య-కార్తి కలిసి ఈ చిత్రంలో సందడి చేయడం ఖాయమని కోలీవుడ్ వర్గాలంటున్నాయి.

This post was last modified on May 12, 2022 8:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

11 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

12 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

13 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

13 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

13 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

14 hours ago