తొలి రోజు డివైడ్ టాక్‌ను తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర బలంగానే నిలబడింది పుష్ప. సుకుమార్ చివరి సినిమా రంగస్థలం స్థాయిలో క్లాసిక్ స్టేటస్ తెచ్చుకోకపోయినా, దానిలా పర్ఫెక్ట్ కాకపోయినా అనేక ఆకర్షణలు తోడవడం, బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కూడా కలిసి రావడంతో ఈ చిత్రం ఓవరాల్‌గా బ్లాక్‌బస్టర్ స్టేటస్ అందుకుంది. ముఖ్యంగా ఈ చిత్రం హిందీలో ఆడిన వైనం ట్రేడ్ పండిట్లకు పెద్ద షాక్. రిలీజ్ తర్వాత పుష్ప క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం విశేషం.
ఈ సినిమా పాటలు, అలాగే హీరో మేనరిజమ్స్, డైలాగ్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. దీంతో పుష్ప-2 మీద అంచనాలు ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ అంచనాలను అందుకోవడానికి సుకుమార్ గట్టి కసరత్తే చేస్తున్నట్లు సమాచారం. వాస్తవంగా ఫిబ్రవరిలోనే షూటింగ్ అనుకున్నప్పటికీ.. సెకండ్ పార్ట్ స్క్రిప్టు మీద మరింత వర్క్ చేస్తుండటం వల్ల ఆలస్యమవుతున్నట్లు సమాచారం.
ముందు అనుకున్న కథలో కొన్ని మార్పులకు తోడు.. కొత్త ఆకర్షణలు కూడా జోడించే ప్రయత్నం జరుగుతోందట. అందులో భాగంగా ఇంకో హీరోయిన్ని కూడా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట సుక్కు. శ్రీవల్లికి, పుష్పకు పెళ్లయిపోవడంతో అల్లరి, కొంటె సీన్లు పెట్టడానికి ఇబ్బంది ఉండటం.. రెండో పార్ట్‌లో కూడా అదే హీరోయిన్ని చూపిస్తే బోర్ కొట్టే అవకాశం ఉండటంతో ఒక కొత్త లేడీ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయాలని ఫిక్సయ్యారట.
పుష్ప సహాయకురాలి పాత్రగా అది ఉంటుందని, కాస్త పేరున్న హీరోయిన్నే ఆ పాత్రకు తీసుకుంటారని.. దాంతో రొమాన్స్ చేయిస్తారని.. పాటలు ఉంటాయని.. దాని వల్ల సినిమాకు అదనపు ఆకర్షణ చేకూరుతుందని అనుకుంటున్నారట. దీంతో పాటుగా ఇందులోనూ ఒక ఐటెం పాట ఉంటుందని, అందులో ఒక టాప్ హీరోయినే నటిస్తుందని చిత్ర వర్గాల సమాచారం. జూన్లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలున్నాయి.
This post was last modified on May 12, 2022 12:32 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…