మొత్తానికి సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల నిరీక్షణకు తెరపడబోతోంది. గత ఏడాదే విడుదల కావల్సి ఉండి కరోనా మహమ్మారి కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడ్డ సర్కారు వారి పాట మరి కొన్ని గంటల్లో థియేటర్లలోకి దిగబోతోంది. మహేష్ అభిమానుల్లోనే కాక.. సామాన్య ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఇదొకటి.
దీని కంటే ముందు మహేష్ నటించిన మూడు సినిమాలూ సూపర్ హిట్లయ్యాయి. ఐతే ఈ సినిమాలో మహేష్ ఎలా నటించాడు.. అతడి పాత్ర ఎలా ఉంది.. అన్న దాని కంటే దర్శకుడిగా పరశురామ్ సత్తా గురించే ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఈ సినిమాకు ముందు వరకు అతను మీడియం రేంజ్ డైరెక్టర్. గీత గోవిందం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టినప్పటికీ.. కాస్టింగ్, బడ్జెట్ పరంగా చూస్తే అది మీడియం రేంజ్ సినిమానే.
అంతకుముందు పరశురామ్ ఇంకా చిన్న సినిమాలు తీశాడు. అలాంటి దర్శకుడికి మహేష్ బాబు లాంటి టాప్ స్టార్‌ను డైరెక్ట్ చేసే అవకాశం రావడం చిన్న విషయం కాదు. గీత గోవిందం సక్సెస్‌కు తోడు.. తనను ఎగ్జైట్ చేసే స్క్రిప్టు చెప్పడంతో మహేష్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సినిమా ప్రమోషన్లలో పరశురామ్‌కు మహేష్ ఇచ్చిన ఎలివేషన్ అలా ఇలా లేదు. అతడి రైటింగ్ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. సినిమా చూసి ప్రేక్షకులు ఊగిపోతారని.. థియేటర్లు దద్దరిల్లిపోతాయని.. తన క్యారెక్టర్ భలేగా డిజైన్ చేశాడని.. ఇలా పరశురామ్ గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడాడు మహేష్.
ఈ చిత్ర నిర్మాతలు అంతర్గత చర్చల్లోనూ సినిమా చాలా బాగా వచ్చిందని, పరశురామ్ అదరగొట్టాడనే చెబుతున్నట్లు తెలుస్తోంది. పరశురామ్ సైతం సూపర్ కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నాడు సినిమా గురించి. ఐతే రిలీజ్ ముంగిట ఈ పొగడ్డలు, ఈ కాన్ఫిడెన్స్ అంతా మామూలే. మరి వీళ్లందరి వ్యాఖ్యలకు, పరశురామ్ నమ్మకానికి తగ్గట్లు సినిమా ఉంటుందా.. నిజంగా అతను మహేష్ కెరీర్లో మెమొరబుల్ సినిమాను అందించాడా, పోకిరి లెవెల్లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతున్నాడా.. మహేష్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ జమ చేయబోతున్నాడా అని.. అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే రిలీజ్ తర్వాత కూడా ఎక్కువగా పరశురామ్ గురించే అంతా చర్చించుకుంటారనడంలో సందేహం లేదు.
This post was last modified on May 12, 2022 6:00 am
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…