హీరోగా కష్టపడి ఎదిగాడు.. సూపర్ సక్సెస్ అయ్యాడు.. భవిష్యత్ ఎంతో ఆశాజనకంగా ఉంది.. అయినా లోపల ఏం బాధ దాగుందో కానీ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. డిప్రెషనే అతడి ఆత్మహత్యకు కారణమని వెల్లడైంది. సుశాంత్ కంటే ముందు ఇలా ఫిలిం సెలబ్రెటీలు ఆత్మహత్యలకు పాల్పడ్డ ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఆ స్థితికి వెళ్లి తర్వాత ఆలోచన మార్చుకున్న వాళ్లూ చాలామందే ఉన్నారు. అందులో తానూ ఒకదాన్ని అంటోంది టాలీవుడ్ హీరోయిన్, బిగ్ బాస్ పార్టిసిపెంట్ నందినీరాయ్.
మోసగాళ్లకు మోసగాడు సహా కొన్ని సినిమాల్లో నటించిన నందిని.. మధ్యలో కొంత కాలం కనిపించకుండా పోయింది. తర్వాత బిగ్‌బాస్‌తో మళ్లీ ఫేమ్ తెచ్చుకుంది. ఈ షోలో భాగంగానే తాను ఒక దశలో డిప్రెషన్‌కు వెళ్లినట్లు చెప్పిన నందిని.. ఇప్పుడు సెలబ్రెటీల డిప్రెషన్ మీద పెద్ద చర్చ నడుస్తున్న నేపథ్యంలో తాను ఒక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు తెలిపింది.
‘‘సినీ పరిశ్రమలో సక్సెస్ వల్ల వచ్చే క్రేజ్, పాపులారిటీ బాధ్యతను పెంచుతుంది. సక్సెస్‌లు వస్తున్నప్పుడు కెరీర్‌పై అభద్రతాభావం ఏర్పడుతుంది. ప్రతి శుక్రవారం జాతకాలు మారిపోతుంటాయి. సక్సెస్సా, ప్లాపా అనే భయం వెంటాడుతుంటుంది. ఆ క్రమంలోనే కొందరు బాగా ఒత్తిడికి లోనై డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టకముందు సుమారు ఏడేళ్ల పాటు నేను డిప్రెషన్‌లో ఉన్నాను. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయి. అయితే ఆ ఆలోచనల నుంచి బయటికి రావడానికి స్నేహితులతో తరచూ మాట్లాడుతూ ఉండేదాన్ని. అంతే కాక డాక్టర్ దగ్గర చికిత్స తీసుకున్నాను. బిగ్‌బాస్ తర్వాత డిప్రెషన్ నుంచి విముక్తి కలిగింది’’ అని నందినీరాయ్ తెలిపింది.
This post was last modified on June 24, 2020 10:28 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…