మరో రెండ్రోజుల్లో మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ రిలీజవుతుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ తో బిజీ అయిపోయాడు మహేష్. రెగ్యులర్ గా మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు సూపర్ స్టార్. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సాంగ్స్ బిహైండ్ స్టోరీస్ షేర్ చేసుకున్నాడు మహేష్.
ఆల్బం నుండి ఫస్ట్ సింగిల్ గా రిలీజై సెన్సేషనల్ హిట్ సాధించిన ‘కళావతి’ సాంగ్ ముందుగా మహేష్ కి అలాగే దర్శకుడు పరశురాంకి నచ్చలేదంట. మహేష్ లాంటి హీరోని పెట్టుకొని కళావతి అంటూ స్మూత్ సాంగ్ పెట్టడం కరెక్టేనా ? అంటూ పరశురాం తమన్ ని క్వశ్చన్ చేశాడట. ఇక మహేష్ కి కూడా ట్యూన్ ప్లస్ లిరిక్స్ అంతగా నచ్చలేదంట. ఆ టైంలో తమన్ ఇద్దరినీ కన్విన్స్ చేసి ప్రతీ పెళ్లిలో ఈ పాటే ప్లే అయ్యేలా ఉంటుంది. ఆల్బంలో బెస్ట్ సాంగ్ అవుతుందని భరోసా ఇచ్చాడట. దీంతో మహేష్ , పరశురాం ఇద్దరూ కన్విన్స్ అయ్యారట.
అలా ముందుగా నచ్చలేదనుకున్న సాంగ్ ఇప్పుడు మహేష్ కి అలాగే టీం అందరికీ ఫేవరేట్ అయిపోయింది. సినిమా మీద బజ్ తీసుకురావడానికి పిల్లర్ అయింది. ఎక్కడ చూసినా ఈ సాంగే ప్లే అవుతుంది. అలాగే సినిమాలో ‘మురారి’ అంటూ ఇంకో సాంగ్ పెట్టారట. కానీ సినిమా ఫ్లో చూసుకున్నాక ఒక స్విచువేషణ్ లో దానికి బదులు ఓ మాస్ సాంగ్ పడితే బాగుంటుందని ఫీలయ్యారట. అందుకే ఉన్నపళంగా “మురారి” సాంగ్ ని పక్కన పెట్టేసి “మమ మహేశా” సాంగ్ పెట్టి అప్పటికప్పుడు షూట్ చేసి రెడీ చేసి అటాచ్ చేశారట. ఇక త్వరలోనే మురారి సాంగ్ యూ ట్యూబ్ లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు. ఇదీ ‘సర్కారు వారి పాట’లో ఉన్న పాటల బిహైండ్ స్టోరీ అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు మహేష్.
This post was last modified on May 10, 2022 10:26 pm
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…