‘బాహుబలి’ పేరెత్తితే చాలు బాలీవుడ్ వాళ్ల ఫీలింగే మారిపోతుంది. ‘బాహుబలి’ ఫస్ట్ పార్ట్ రిలీజై ఏడేళ్లు కావస్తోంది. సెకండ్ పార్ట్ రిలీజై ఐదేళ్లు దాటిపోయింది. ఇంకా దాని తాలూకు ప్రతికూల ప్రభావం బాలీవుడ్ మీద కొనసాగుతూనే ఉంది.
సౌత్ సిినిమాలకు నార్త్ మార్కెట్లో అది గేట్లు తెరిస్తే.. ఇప్పుడు పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి చిత్రాలు అక్కడ ఎలా వసూళ్ల మోత మోగించాయో తెలిసిందే. దీనికి తోడు చారిత్రక నేపథ్యంలో బాలీవుడ్లో ఏ భారీ చిత్రం తీసినా.. ప్రేక్షకులు ‘బాహుబలి’తో పోల్చుకుని చూస్తుండటం అన్నిటికంటే పెద్ద తలనొప్పిగా మారింది.
ఆ స్థాయి భారీతనం, ఎమోషన్లు, మాస్, విజువల్ ఎఫెక్ట్స్.. ఇవన్నీ ఆశించడం వల్ల బాలీవుడ్ సినిమాలు హిందీ ప్రేక్షకులకు ఆనడం లేదు. బాజీరావు మస్తానీ, పద్మావత్ లాంటి సినిమాలు మామూలుగా అయితే ఇంకా పెద్ద సక్సెస్ కావాల్సినవి. కానీ ‘బాహుబలి’ తర్వాత రావడం వల్ల అవి ఓ మోస్తరు విజయంతో సరిపెట్టుకున్నాయి.
ఇక ‘బాహుబలి’తో పోల్చి చూడటం వల్ల ‘కళంక్’ లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దారుణ పరాభవం ఎదుర్కొన్నాయి. ఇప్పుడు బాలీవుడ్ నుంచి రాబోతున్న మరో భారీ చిత్రంపై ‘బాహుబలి’ ప్రతికూల ప్రభావం పడేలా కనిపిస్తోంది. ఆ చిత్రమే.. పృథ్వీరాజ్.
యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో అక్షయ్ కుమార్ హీరోగా చంద్రప్రకాష్ ద్వివేది రూపొందించిన ఈ చిత్రం ‘బాహుబలి’ని గుర్తుకు తెస్తోంది. కాకపోతే రాజమౌళి తీసింది కల్పిత కథ కాగా.. పృథ్వీరాజ్ వాస్తవ గాథనే. ఉత్తరాది జనాలు గొప్ప చరిత్రలో గొప్ప యోధుడిగా భావించే పృథ్వీరాజ్ చౌహాన్ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
ఐతే రాజులు, రాజ్యాలు, యుద్ధాలు.. ఈ నేపథ్యంలో భారీ ఖర్చుతోనే సినిమా తీసినా.. అద్భుతమైన సెట్స్ వేసినా.. భారీ స్థాయిలో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించినా.. ‘బాహుబలి’ ట్రైలర్ చూసినపుడు కలిగిన ఉద్వేగం మాత్రం ఇక్కడ కలగడం లేదు.
రాజమౌళిలా భావోద్వేగాలు పండించడం, మాస్-యాక్షన్ సన్నివేశాలు ఎలివేట్ చేయడం.. సగటు ప్రేక్షకుడికి గూస్ బంప్స్ ఇవ్వడం బాలీవుడ్ దర్శకులకు సాధ్యం కాదని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
బాలీవుడ్ స్టయిల్లో కాస్‌గా, నెమ్మదిగా, ఇంటలిజెంట్ నరేషన్‌తో సినిమా సాగేలా ఉంది. ఈ తరహా చిత్రాలు హిందీ ప్రేక్షకులకు ఇప్పుడు అస్సలు రుచించడం లేదు. వాళ్లు సౌత్ నుంచి వచ్చే మాస్, యాక్షన్, ఎలివేషన్ సినిమాలకే బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 3న రాబోతున్న ‘పృథ్వీరాజ్’ ఏమాత్రం ప్రభావం చూపుతుందన్నది సందేహం.
This post was last modified on May 10, 2022 10:18 pm
చైనాలో హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాప్న్యుమో వైరస్) వైరస్ కారణంగా ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిందన్న వార్తలను చైనా ప్రభుత్వం ఖండించింది. ఈ…
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు నిర్మించేందుకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టులు ఆర్థిక, వాణిజ్య…
గత దశాబ్ద కాలంలో తెలుగు సినిమాలో వేగంగా ఎదిగిన కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ ఒకడు. దివంగత రాకేష్ మాస్టర్ దగ్గర…
మనలో చాలామందికి పొద్దున నిద్రలేచిందే టీ లేక కాఫీ ఏదో ఒకటి తాగకపోతే రోజు ప్రారంభమైనట్లు ఉండదు. అయితే చాలాకాలంగా…
అవును.. మీరు చదివింది నిజమే. ఇలాంటి వాళ్లు ఉంటారా? అన్న సందేహం రావొచ్చు. కానీ.. ఇప్పుడు ఇదే పెద్ద ట్రెండ్…
టాలీవుడ్ లో అసలు అపజయమే ఎరుగని దర్శకుల్లో రాజమౌళి తర్వాత చెప్పుకోవాల్సిన పేరు అనిల్ రావిపూడి. కళ్యాణ్ రామ్ పటాస్…